బింబిసారతో ఓ మంచి హిట్టు కొట్టాడు నందమూరి హీరో కల్యాణ్ రామ్. చాలా యేళ్ల తర్వాత కళ్యాణ్ రామ్ కు బింబిసారా సినిమా రూపంలో మంచి హిట్టు కొట్టింది. పైగా సీతారామం లాంటి క్లాసిక్ సినిమా కు పోటీగా వచ్చి మరీ బింబిసార సూపర్ హిట్ అయ్యింది. అంతకు ముందు అంటే 2015 లో కళ్యాణ్ రామ్ కు పటాస్ రూపంలో మంచి హిట్ దక్కింది. ఆ తర్వాత 118 రూపంలో జస్ట్ యావరేజ్ సినిమా ఒకటి పడింది. తప్పితే మధ్యలో కళ్యాణ్ రామ్ చసిన అన్ని సినిమాలు ప్లాప్ లేదా డిజాస్టర్లు అవుతున్నాయి. డెవిల్ సినిమా కంటెంట్ పరంగా మంచి ప్రయత్నమే అయినా కూడా ఎందుకో కాని ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇక బింబిసార తర్వాత వచ్చిన అమిగోస్, డెవిల్ రెండు సినిమాలు మంచి ప్రయత్నాలే అయినా కూడా నిరాశ పరిచాయి. ఇప్పుడు కళ్యాణ్ రామ్ నుంచి ‘ అర్జున్ సన్నాఫ్ వైజయంతీ ’ సినిమా వస్తోంది. సీనియర్ హీరోయన్ .. లేడీ అమితాబచ్చన్ విజయశాంతి కీలక పాత్ర పోషించిన సినిమా ఇది. ప్రదీప్ దర్శకుడు .. ఇక ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ కు మంచి స్పందన కూడా వచ్చింది. సినిమా కూడా పూర్తవ్వడంతో సమ్మర్ కానుకగా మేలో విడుదల చేద్దామన్నది ప్లాన్.
అయితే ఇప్పుడు లేటెస్ట్ టాక్ ఏంటంటే కల్యాణ్ రామ్ కాస్త తొందర పడుతున్నాడట. ఏప్రిల్ 18న ఈ సినిమాని రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యాడట. అంటే… మరో 15 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ 1 5 రోజులలో కావాల్సినంత ప్రమోషన్లు చేసుకుంటారా ? అంటే డౌటే. ఇటీవల నిర్మాతలు ప్రమోషన్ల మీద బాగా కాన్ సంట్రేషన్ చేస్తున్నారు. నిర్మాతలు. కనీసం నెల రోజుల ముందు నుంచే హడావుడి మొదలెడుతున్నారు. అలాంటప్పుడు 15 రోజుల గ్యాప్ చాలా తక్కువ అని చెప్పాలి. ఇక ట్రైలర్ కు ఖచ్చితంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ఆకర్షణ అయితే ఉంది. రెండు వారాల్లో గట్టిగా ప్రమోషన్ చేసుకుంటే మంచి ఓపెనింగ్స్ వస్తాయంటున్నారు. ఏదేమైనా సినిమా ను కాస్త జాగ్రత్తగా ప్రమోట్ చేసుకుంటే కళ్యాణ్ రామ్ కెరీర్‌లో మరో మంచి హిట్ పడే ఛాన్సులు ఉన్నాయి. అలా కాకుండా కంగారు పడితే రాబిన్‌హుడ్ లా కంటెంట్ తేడా కొడితే ఫస్ట్ వీక్ లోనే ఈ సినిమా కథ కంచికి చేరిపోవడం ఖాయం.
కళ్యాణ్ రామ్ అంత తొందరెందుకు బాసు …ఇలా అయితే ఎలా.. ?
