మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా ఇటీవలే మొదలైంది. అనిల్ రావిపూడి దర్శకుడు. 2026 సంక్రాంతి బరిలో ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. ఆ టార్గెట్‌తోనే ఈ సినిమాను షూటింగ్ స్పీడ్‌గా చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రణాళికలు రచిస్తూ ముందుకు వెళుతున్నారు. ఇక చిరు ఫోకస్ అంతా అనిల్ రావిపూడి సినిమా మీదే ఉంది. అయితే ఈ హడావిడిలో విశ్వంభర సినిమాను అస్సలు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అసలు విశ్వంభర సినిమా ఈ యేడాది సంక్రాంతికి రావాల్సి ఉంది.
సంక్రాంతి వచ్చింది.. వెళ్లింది.. తర్వాత సమ్మర్ కానుకగా మే నెలలో రిలీజ్ అన్నారు. ఇప్పుడు ఆగస్టు 22 రిలీజ్ డేట్ అంటున్నా ఎవ్వరికి క్లారిటీ లేదు. ఇక విశ్వంభర నుంచి ఓ అప్‌డేట్ వచ్చి చాలా కాలం అయ్యింది. టీజర్ తరవాత.. అభిమానులకు ఎలాంటి న్యూస్ లేదు.. ఎలాంటి సర్‌ప్రైజ్ లేదు. మధ్యలో చాలా పండగలు వచ్చాయి.. వెళ్లాయి. అయితే విశ్వంభర సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ లేదు.విశ్వంభర సినిమాలో 5 పాటలతో పాటు, కొన్ని బిట్ సాంగ్స్ ఉన్నాయి. వాటిలో ఒక్కటి కూడా విడుదల కాలేదు. విశ్వంభర ఓటీటీ డీల్ క్లోజ్ కాలేదని, భేరసారాలు నడుస్తున్నాయని చాలా రోజుల నుంచి చెపుతున్నారు. ఓటీటీ ఎట్రాక్షన్ కోసం అయినా ఓ సాంగ్ రిలీజ్ చేసి ఉంటే బాగుండేది. అలాంటి ప్రయత్నాలేవి కూడా జరగలేదు. మెగా ఫ్యాన్స్ ప్రతి సారి విశ్వంభర సినిమా గురించి అడుగుతున్నా ఎవ్వరి వైపు నుంచి స్పందన లేదు. చిరు కూడా ఈ సినిమా మీద పెద్దగా దృష్టి పెట్టినట్టు లేదు. ఫైనల్‌గా చూస్తుంటే ఈ సినిమా మీద అటు చిరుకు.. ఇటు మెగాభిమానులకు ఎవ్వరికి నమ్మకాలు లేవన్న టాకే ఎక్కువుగా నడుస్తోంది.