Moviesరామ్‌చ‌ర‌ణ్ ఫ‌స్ట్ మూవీ చిరుత సినిమా ఫ‌స్ట్ హీరో ఎవ‌రో తెలుసా..!

రామ్‌చ‌ర‌ణ్ ఫ‌స్ట్ మూవీ చిరుత సినిమా ఫ‌స్ట్ హీరో ఎవ‌రో తెలుసా..!

మెగా ప‌వ‌ర్ స్టార్‌, గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ 2006లో వ‌చ్చిన చిరుత సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యారు. ఆ సినిమాను వైజ‌యంతీ మూవీస్ నిర్మిస్తే.. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ రోజుల్లోనే 43 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు అందించ‌గా నేహాశ‌ర్మ హీరోయిన్‌. అయితే వాస్త‌వానికి ఈ సినిమాకు ముందు అనుకున్న హీరో రామ్‌చ‌ర‌ణ్ కాద‌ట‌. మ‌రి ఆ హీరో ఎవ‌రు ? ఆ క‌థ ఏంటో చూద్దాం. దర్శకుడు పూరి జగన్నాథ్‌ కు మెహర్ రమేశ్‌ కు మధ్య చక్కని అనుబంధం ఉంది. ఇక్కడ పూరి తెరకెక్కించిన ఆంధ్రావాలాను కన్నడలో మెహర్ రమేశ్‌ వీర కన్నడిగ పేరుతో తెరకెక్కించాడు.Chirutha (2007) - IMDbఆంధ్రావాలా ఇక్క‌డ డిజాస్ట‌ర్ అయితే అక్క‌డ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో దివంగ‌త పునీత్ రాజ్ కుమార్ హీరో. ఆ తర్వాత తెలుగు సినిమా ఒక్కడును ‘అజయ్’ పేరుతో కన్నడలో రీమేక్ చేస్తే అది కూడా బ్లాక్బ‌స్ట‌ర్‌. ఇందులోనూ పునీతే హీరో. అలా పూరితో ఏర్పడిన అనుబంధంతో ఆయన సోదరుడు సాయిరామ్ శంకర్ కోసం మెహర్ రమేశ్ ఓ క‌థ రాస్తే దానికి పూరి గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో సినిమా స్టార్ట్ అయ్యి బ్యాంకాంగ్ లో ఓ షెడ్యూల్ కూడా తీశారు. కొన్ని కార‌ణాల‌తో ఈ సినిమా ఆగిపోయింది.Sairam Shankar is looking for a hit | Sairam Shankar is looking for a hit

అదే కథ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్‌ హీరోగా ‘చిరుత’ పేరుతో రూపుదిద్దుకుంది. రామ్ చరణ్‌ ఈ సినిమాతోనే హీరోగా పరిచయం అయ్యి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల మెహర్ రమేశ్‌ కు అత్యంత సన్నిహితుడైన రచయిత తోట ప్రసాద్ ఈ ముచ్చట్లను వివరించారు.

Latest news