అజ్ఞాతవాసి అనే టైటిల్ తో పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎంతో ప్రత్యేక అనుబంధం ఉంది .. దీని గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు .. 2018 సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు .. అప్పట్లో పవన్ కళ్యాణ్ చివరి సినిమాగా ప్రమోట్ చేయబడిన అజ్ఞాతవాసి మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకొని పవన్ కెరియర్ లోనే కాక తెలుగు సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ ప్లాఫ్ గా నిలిచింది .. ఇలా ప్రతి సంవత్సరం జనవరి 10న పవన్ అజ్ఞాతవాసి సినిమాని గుర్తు చేసుకుని అభిమానులు బాధపడుతూ ఉంటారు .అయితే ఇలాంటి అజ్ఞాతవాసికి ఇప్పుడు హిట్ టాక్ రావడం అనేది కొంత హాట్ టాపిక్ గా మారింది .. అయితే ఇదే పవన్ కళ్యాణ్ నటించిన తెలుగు అజ్ఞాతవాసి సినిమా కాదు .. కన్నడలో వచ్చిన అజ్ఞాతవాసి .. థ్రిల్లర్ మూవీ గా వచ్చిన ఈ సినిమా అక్కడి ప్రేక్షకులు మాత్రమే కాదు మిగతా భాషల ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటూ సూపర్ హిట్‌గా నిలిచింది .. సప్త సాగరాలు దాటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు హేమంత్ ఈ సినిమాను నిర్మించారు .
ఇక చాలాకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న కన్నడ సినిమా ఇండస్ట్రీకి అజ్ఞాతవాసి మంచి ఊపును ఇచ్చింది .. ఇక ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారట . ఇక మరి తెలుగులో ఎలాంటి టైటిల్ పెడతారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది .. మన తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ థియేటర్లో అవైలబుల్ ఉన్న ఈ సినిమాని ఆదరించండి అంటూ నిర్మాత హేమంత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు .
పవన్ కళ్యాణ్ అభిమానులు షాక్ అయ్యే న్యూస్ .. ఇదేం విడ్డూరం రా బాబు..!
