మంచు మోహన్ బాబు కుటుంబంలో తలెత్తిన గొడవలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా సైలెంట్ అయిన ఈ వివాదం ఇప్పుడు మరోసారి పోలీస్ స్టేషన్కు చేరింది. దీంతో మంచు ఫ్యామిలీ రచ్చ మరోసారి హాట్ టాపిక్ గా మారింది .. తన తండ్రి తో మాట్లాడాలంటూ జల్‌పల్లిలో నివాసం ఉంటున్న మోహన్ బాబు ఇంటి వద్దకు మనోజ్ వెళ్లడంతో అక్కడ ఇప్పుడు హై టెన్షన్ వాతావరణం నెలకొంది .. నిన్న మంగళవారం చోటు చేసుకున్న పలు పరిణామాల దృష్ట్యా బుధవారం ఉదయం నుంచి జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు మహరించారు ..
అలాగే మోహన్ బాబు ఇంట్లోకి మనోజ్ వెళ్లేందుకు ప్రయత్నించిగా గేటు తెరవకపోవడంతో ఆయన అక్కడే బయట బైఠాయించి ధర్నాకు దిగారు .. అయితే ఈ క్రమం లోనే పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు .. అలాగే మోహన్ బాబు ఇంటికి రెండు కిలోమీటర్ల నుంచి పోలీస్ ఆంక్షలు కూడా విధించారు .. ఇక తన కూతురు పుట్టిన రోజు వేడుకల కోసం మనోజ్ జైపూర్ వెళ్లడాని అవకాశంగా తీసుకుని ఆయన సోదరుడు విష్ణు తన ఇంట్లోకి వెళ్లి తన కారును తీసుకెళ్లారని కూడా పోలీసులకు కంప్లైంట్ చేశారు మనోజ్ ..
అలాగే తన సోదరుడు విష్ణు 150 మందితో జల్ పల్లిలోని తన ఇంట్లోకి ప్రవేశించి తన వస్తువులు సామాగ్రిని ధ్వంసం చేశారని . అలాగే తన కారులను టోయింగ్ వాహనంతో ఎత్తుకెళ్లి రోడ్డు మీద వదిలేసారని .. అలాగే తన కారును దొంగతనంగా తీసుకుని విష్ణు తన ఇంట్లో పార్కు చేశాడని జల్ పల్లిలోని తన భద్రత సిబ్బంది పై దాడి కూడా చేశారని ఆయన ఆరోపించారు .. అలాగే తన కారు చోరీపై నార్సింగి పోలీసులకు సమాచారం ఇవ్వగా అది విష్ణు ఇంట్లో ఉన్నట్టు వారు గుర్తించారు .. రికవరీ కి వెళ్ళినప్పుడు దానిని మాదాపూర్ పంపినట్లు మనోజ్ మీడియా తో కూడా వెల్లడించారు ..