నటుడు మరియు నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా అర్జున్ S/O విజయశాంతి అనే పవర్ఫుల్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. చాలా రోజుల తర్వాత సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఈ సినిమాలో నటిస్తుండడంతో పాటు కళ్యాణ్‌రామ్‌కు తల్లిగా సిన్సియర్ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ సాయి మంజ్రేకర్ .. కళ్యాణ్ రామ్ కి జోడిగా నటించగా … ప్రదీప్ చిలుకూరు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా రేపు వరల్డ్ వైడ్‌గా భారీ అంచనాలతో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు భారీ ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్టు టాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. అర్జున్‌కు వరల్డ్ వైడ్‌గా దాదాపు రు. 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఇప్పుడున్న టఫ్ కాంపిటేషన్ లో కళ్యాణ్‌రామ్‌కు ఇది బిగ్ టార్గెట్టే అని చెప్పాలి. రు. 24 కోట్ల షేర్ రాబడితేనే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ సినిమాగా నిలుస్తుంది. అలా జరగాలి అంటే సినిమాకు మంచి హిట్ టాక్ రావాలి.