Movies' కోర్ట్ ' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌... ఫైన‌ల్ క‌లెక్ష‌న్లు...

‘ కోర్ట్ ‘ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌… ఫైన‌ల్ క‌లెక్ష‌న్లు ఎన్ని కోట్లో తెలుసా..!

టాలీవుడ్ నేచుర‌ల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన మూవీ ‘కోర్ట్’- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ఈ సినిమాకి థియేట‌ర్ల‌లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. త‌క్కువ బ‌డ్జెట్‌తో .. చిన్న స్టార్ కాస్టింగ్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా థియేట్రిక‌ల్‌గా లాంగ్ ర‌న్‌లో ఏకంగా రు. 57 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది.Court trailer: Hard-hitting with a sensational subject

ఇటీవ‌ల‌ కాలంలో చిన్న సినిమాల్లోనే.. అత్యంత లాభదాయక సినిమాగా కోర్ట్ నిలిచింది. మొత్తంమీద రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సాలిడ్ కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ సినిమాలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, రోహిణి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. కోర్ట్ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు.Court' movie review: Priyadarshi leads a compelling drama directed by Ram  Jagadeesh - The Hinduఇక కోర్ట్ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఏప్రిల్ 11న, 2025 నుండి కోర్ట్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా కోర్ట్ ప్రీమియర్ తేదీని ప్రకటించింది. అయితే, ఇతర భాషలలో డబ్బింగ్ వెర్షన్‌లకు సంబంధించిన స్ట్రీమింగ్ డేట్‌ మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Latest news