నందమూరి నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘ అఖండ ’ సినిమా ఎంత అద్భుత విజయం సాధించిందో చూశాం. ఇప్పుడు అఖండ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాలోని ఫ్లాష్ బ్యాక్‌పై ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ ప్లాష్ బ్యాక్‌లో బాలయ్య రెగ్యులర్ పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుందని.. ముఖ్యంగా సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా చాలా ఎయోషనల్‌గా ఉంటుందని తెలుస్తోంది.
ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయాలు నమోదు కావడంతో ఇప్పుడు అఖండ 2 – తాండవంపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ యేడాది సెప్టెంబర్ 28న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేస్తున్నారు.