టాలీవుడ్ యంగ్‌టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఇపుడు భారీ బాలీవుడ్ సీక్వెల్ వార్ 2సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సెన్షేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమా మీద కూడా అంచనాలు మామూలుగా లేవు.ఇదిలా ఉంటే ఎన్టీఆర్ చివరి సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర పాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ హిట్ అయ్యింది. దేవర సినిమాకు సీక్వెల్‌గా దేవర 2 కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం కొరటాల శివ తన టీంతో కలిచి దేవర సీక్వెల్ వర్క్ పనిలో బిజీగా ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ వార్.. ఆ వెంటనే ప్రశాంత్ నీల్ సినిమా కూడా పినిష్ చేసి.. దేవర 2ను కూడా త్వరగా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.
నీల్ ప్రాజెక్ట్ వీలైనంత త్వరగా ఫినిష్ చేసి ఈ ఏడాది లోనే దేవర 2 కూడా పట్టాలెక్కించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూడు సినిమాల తర్వాత మరోసారి ఎన్టీఆర్ రాజమౌళితో జతకట్టే ప్లానింగ్ అయితే ప్రస్తుతానికి ఉంది.
‘ దేవర 2 ‘ సినిమాపై ఎన్టీఆర్ లో కంగారు ఎందుకు ..?
