టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అసలు ఏం జరుగుతుంది ? అనే విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. కొంతమంది షూటింగ్ అంటారు.. మరి కొంతమంది రిహార్సల్ అంటారు.. చివరకు కొబ్బరికాయ కొట్టిన విషయం కూడా బయటికి చెప్పలేదు. అంటే రాజమౌళి అంత గోప్యత పాటిస్తారు.. రాజమౌళి తన సినిమాల షూటింగ్ జరుగుతున్నప్పుడు లీకులు రావటానికి అస్సలు ఇష్టపడరు. చాలా జాగ్రత్తగా ఉంటారు.
అయితే మహేష్ బాబు సినిమా విషయంలో లీకులు వస్తూ ఉండటంపై రాజమౌళి కోపం కట్టలు తెంచుకుంటుందట. సినిమా అవుట్ డోర్ కు షిఫ్ట్ అయింది.. అవుట్ డోర్ లో షూటింగ్ బయట వ్యక్తులను … వాళ్ళ చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ను కంట్రోల్ చేయడం కష్టం. తాజాగా ఈ సినిమా షెడ్యూల్ కోసం ఒరిస్సాలోని కోరాపూట్‌కు వెళ్లారు యూనిట్ సభ్యులు. అక్కడ మహేష్ దిగాడో లేదో ఫోటో క్లిక్ మనిపించారు.జనం అలాగే ఈ సినిమాలో పృథ్విరాజ్ సుకుమార్ అని కూడా నటిస్తున్నాడని విషయం ఈ లీకులు ద్వారా బయటికి వచ్చేసింది. సినిమా సెట్స్ మీదకు వెళ్లాక ఇంకా ఎన్ని లీకులు వస్తాయో చూడాలి. ఈసారి లీకులను ఆపటం రాజమౌళి వల్ల కూడా కావడం లేదు.. అందుకే రాజమౌళి కోపం కట్టలు తెంచుకుంటుందట. సినిమా లీకులు బయటకు వస్తే సినిమా మీద ఎక్కడ ఆసక్తి తగ్గుతుందో ? అన్న టెన్షన్ రాజమౌళిది.