తాజాగా మన తెలుగులో సెన్షేషనల్ క్రియేట్ చేస్తోన్న గ్లింప్స్ ఏదైనా ఉందంటే అది నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ సినిమా ది ప్యారడైజ్. ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. ఇందులో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి హైలెట్ అయ్యింది.
ప్రస్తుతం సౌత్ లో ఆల్ టైం టాప్ 3 సంగీత దర్శకుల్లో అనిరుధ్ ఒకరు. తన పాటల కంటే మెయిన్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కే ఆడియెన్స్ మెస్మరైజ్ అయిపోతారు. దీంతో అనిరుధ్ ఒక సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నాడంటే చాలు అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. ఈ డిమాండ్ తోనే అనిరుధ్ ది ప్యారడైజ్ కోసం రికార్డు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టుగా సమాచారం.
గతంలో దేవర సినిమా టైంకే తాను 10 నుంచి 12 కోట్లు రెమ్యునరేషన్ గా ఒకో సినిమాకి తీసుకుంటున్నట్టుగా టాక్ వచ్చింది. ఇపుడు నాని ప్యారడైజ్ సినిమాకి ఏకంగా 14 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్టుగా లేటెస్ట్ టాక్. ఓ మిడిల్ రేంజ్ సినిమాకు అనిరుధ్ ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవడం ఇండియన్ సినిమ హిస్టరీలో రికార్డ్ అని చెప్పాలి.