టాలీవుడ్ యంగ్‌టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ దేవర. ఈ సినిమా సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తోన్న తర్వాత సినిమాలపై మరిన్ని అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాల్లో బాలీవుడ్ సెన్సేషనల్ సీక్వెల్ సినిమా “ వార్ 2 ” కూడా ఒకటి. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన వార్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో తారక్ సాలిడ్ రోల్ లో హృతిక్ తో సమానంగా కనిపించనున్నాడు.ఈ సినిమాలో తారక్ నెగటివ్ రోల్లో కనిపిస్తాడని టాక్ ? ఇక ఈ సినిమా షూటింగ్ లో ఎప్పటికపుడు పాల్గొంటున్న తారక్ ఈ సినిమా కోసం మంచి స్టైలిష్ లుక్ మేకోవర్ చేసి మరీ మెయింటైన్ చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు ఈ లుక్స్ బయటకు వస్తుంటే.. అవి సోషల్ మీడియాలో మంచి వైరల్ గా మారాయి. బృందావనం సినిమా టైంలో ఎన్టీఆర్ ఎలా కనిపించాడో మళ్ళీ ఆ తరహా లుక్స్‌తో ఇప్పుడు ఫ్రెష్ & కూల్‌గా ఉన్నాడు.
దీంతో ఈ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వార్ 2 తర్వాత ఎన్టీఆర్ వరుసగా ప్రశాంత్ నీల్ సినిమా … ఆ తర్వాత దేవర 2.. ఆ తర్వాత రాజమౌళి సినిమాలు చేయనున్నాడు.