పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమాలలో భారీ ప్లాప్ సినిమా “సర్దార్ గబ్బర్ సింగ్” కూడా ఒకటి. తన సెన్సేషనల్ హిట్ గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ దాని తరహాలో సీక్వెల్‌గా ఈ సినిమాను ప్లాన్ చేసుకున్నాడు పవన్. పైగా ఈ సినిమాకు పవన్ స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందించారు. బాబి దర్శకుడు.
ఈ సినిమా అప్పట్లో ఊహించని హైప్‌తో వరల్డ్ వైడ్ గా అనేక దేశాల్లో కూడా రిలీజ్ కి వచ్చింది.అయితే ఈ సినిమా ఇపుడు మళ్ళీ ట్రెండింగ్ లో కనిపిస్తుండడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్స్ అనేవి కామన్‌గా మారిపోయాయి. అయితే ఇప్పుడు సర్దార్ గబ్బర్‌సింగ్ విషయంలోజరుగుతోన్న ట్రోలింగ్‌ను కాస్తా పవన్ అభిమానులు పాజిటివ్ యాంగిల్ లో మార్చేసుకొని వాటిని కూడా వారు ఎంజాయ్ చేస్తున్నారు.
అంతే కాకుండా వారు కూడా పలు ఎడిటింగ్‌లు చేసి వదులుతున్నారను. దీంతో ఇలా గత కొన్ని రోజులు నుంచి సర్దార్ గబ్బర్ సింగ్ మానియాతోనే సోషల్ మీడియా నిండిపోయింది అని చెప్పాలి. ఇక ఇదే దర్శకుడు బాబి తాజాగా ఈ సంక్రాంతికి బాలయ్య హీరోగా డాకూ మహారాజ్ సినిమా తెరకెక్కించి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.
పవన్ ‘ సర్దార్ గబ్బర్‌సింగ్ ‘ మళ్లీ ట్రెండింగ్‌లోకి… !
