Moviesసౌంద‌ర్య‌ను మోహ‌న్‌బాబు హ‌త్య చేయించాడా.. నేనే సాక్ష్యం అంటోంది ఎవ‌రు ?

సౌంద‌ర్య‌ను మోహ‌న్‌బాబు హ‌త్య చేయించాడా.. నేనే సాక్ష్యం అంటోంది ఎవ‌రు ?

తెలుగు సినిమాకు మరో సావిత్రి అంటే దివంగత మహానటి సౌందర్య అనే చెప్పాలి. అంత పద్ధతిగా ఎలాంటి అశ్లీల‌త‌కు తావు లేకుండా సినిమాలు చేస్తూ స్టార్డం సంపాదించడం అంత తెలికైన పని కాదు. దాదాపు తెలుగు, తమిళ, కన్నడ భాషలో స్టార్ హీరోలు అందరి స‌ర‌స‌న నటించి మెప్పించిన సౌందర్య పెళ్లయిన తర్వాత హీరోయిన్గా అవకాశాలు తగ్గుతున్న టైంలో ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలు చేశారు. ఆ తర్వాత రాజకీయాలలోకి ఎంటర్ అయిన సౌందర్య 2004 లో అప్పటి విద్యాసాగర్ రావు ఎన్నికల ప్రచారం కోసం కరీంనగర్ వెళుతూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.సౌందర్య మరణంతో సినిమా ఇండస్ట్రీ షాక్ అయింది. సౌందర్య మరణించి 20 ఏళ్ళు పైనే అవుతుంది. ఆమె మరణం ప్రమాదం వల్లనే అని అంతా ఫిక్స్ అవుతున్న తరుణంలో ఈ నెలకు సౌందర్యది సహజ మరణం కాదు.. ఆమెను హత్య చేయించారు అంటూ ఓ వ్యక్తి బయటికి వచ్చాడు. ఇది నిజంగా షాకింగ్ విషయం. సౌందర్యను టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు హత్య చేయించారంటూ ఒక వ్యక్తి ఆరోపణలు చేస్తున్నాడు.ఆ భూమి, ఇల్లు సౌందర్య ఆస్తి, ఆ భూమిని సౌందర్య ఫ్యామిలీ నుంచి మోహన్ బాబు కొన్నట్టు టాక్ ఉంది. అయితే ఖ‌మ్మం రూర‌ల్ మండ‌లం స‌త్య‌నారాయ‌ణ పురం గ్రామానికి చెందిన చిట్టిబాబు అనే వ్య‌క్తి మాత్రం ఈ భూమిని సౌందర్య ఫ్యామిలీ నుంచి కబ్జా చేశారని ఆరోపిస్తున్నాడు. సౌందర్యను హత్య చేయించింది మంచు మోహన్ బాబు అంటూ కలెక్టర్ ఖమ్మం రూరల్ ఏసిపికి అతను ఫిర్యాదు చేయ‌డంతో పాటు మోహన్ బాబు వల్ల తనకు ప్రాణహాని ఉందని ప్రాణ రక్షణ కల్పించాలని అతను కోరాడు. అంతే కాదు దివంగత హీరోయిన్ సౌందర్యకు శంషాబాద్ జల్లేపల్లిలో ఆరు ఎకరాల గెస్ట్ హౌస్ ఉందని దానిని తమకు అమ్మాలంటూ మోహన్ బాబు అడగగా సౌందర్య సోదరుడు అమర్నాథ్ నిరాకరించాడని కూడా ఇత‌డు చెపుతున్నాడు.

Latest news