మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ హీరో గా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా .. మాస్ దర్శకుడు కొరటాల శివ కాంభో లో పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవర సినిమా గురించి అందరికీ తెలిసిందే .. అయితే ఈ సినిమా సోలో గా ఎన్టీఆర్ కేరీర్‌లోనే రికార్డు గ్రాసర్ గా అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేసింది .. పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర ఎన్టీఆర్ సోగా రూ . 500 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టి బాలీవుడ్ హీరోలకు సవాల్ విసిరాడు ..అయితే ఇప్పుడు ఈ సినిమాని మేకర్స్ జపాన్ లో కూడా రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే .. ఇక జపాన్లో ఈ సినిమా ని మార్చ్ 28 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండ గా ఎన్టీఆర్ కూడా ఈ సినిమా ప్రమోషన్ల కోసం జపాన్ వెళ్లబోతున్నాడు .. అయితే అక్కడ రిలీజ్ కి ఇంకా మూడు వారాల ముందే దేవర మేనియా అక్కడ మొదలైపోయింది. అక్కడ బుకింగ్స్ ఇలా ఓపెన్ చేస్తే అలా హౌస్ ఫుల్ అయిపోతున్నాయి ..
అంతేకాకుండా పలు ఫేమస్ ఐమ్యాక్స్ స్క్రీన్ లో కూడా దేవర ఇదే ర్యాంపేజ్ చూపించడం విశేషం .. దీని తో పాటు జపాన్ లో కూడా దేవర క్రేజ్ గట్టిగా ఉందని కూడా చెప్పవచ్చు .. అనిరుద్ అందించిన సంగీతం సినిమాకు మరో ప్లస్ అయిన విషయం తెలిసిందే .. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే .ఇక మరి దేవర జపాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచనాల క్రియేట్ చేస్తుందో చూడాలి .