అయితే ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎన్నో సంక్రాంతి సీజన్లు చూస్తూ టాలీవుడ్ ఒకటి మాత్రం గట్టిగా డిసైడ్ అయిపోయింది .. సరైన సినిమా సంక్రాంతికి వస్తే లాభాలు గట్టిగా చేసుకోవచ్చు అన్న నమ్మకం బాగా కుదిరింది .. అందుకే ఆరేడు నెల ముందు నుంచే సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నారు .. ఇందుకు ఎవరు వెనక్కి తగ్గడం లేదు .. ఏదైనా పెద్ద సినిమా వస్తేనే ఆలోచిస్తున్నారు .. కానీ సంక్రాంతినే టార్గెట్ గా పెట్టుకుని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు అన్ని విధాలుగా లెక్కలు వేసుకుంటూ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక 2026 సంక్రాంతికి ఇప్పటినుంచే అలాంటి ప్లానింగ్ మొదలైపోయింది . దాదాపు మూడు నాలుగు సినిమాలు సంక్రాంతి మీద దృష్టిపెట్టుకున్నాయి .అనిల్ రావుపూడి -మెగాస్టార్ సినిమా సంక్రాంతి టార్గెట్ గా పక్కాగా వర్క్ చేసుకుంటుంది. అలాగే నవీన్ పోలిశెట్టి , సితార ఎంటర్టైన్మెంట్ సినిమాలు కూడా వచ్చే సంక్రాంతి ని టార్గెట్ గా ప్లాన్ చేస్తున్నారు .. అదే టైంలో మరో మాస్ సినిమాను కూడా ప్రిపేర్ చేయబోతున్నారు .. అయితే ఇది లేదంటే అది దింపాలనేది వీరి ఆలోచన . రవితేజ – కిషోర్ తిరుమల కాంబినేషన్లో వచ్చేసినిమాను కూడా సంక్రాంతి టార్గెట్ పెట్టుకుని రెడీ చేస్తున్నారు .. అలాగే సీనియర్ హీరో నాగార్జునకు సంక్రాంతి డేట్ అంటే చాలా ఇష్టం . ఇప్పుడు అఖిల్ తో చేయబోయే పల్లెటూరి బ్యాక్ డ్రాప్ సినిమాను కూడా సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళుతున్నారు .. అలాగే బాలయ్య అఖండ2 సినిమాను కూడా సంక్రాంతి వరకు హోల్డ్ లో పెట్టకపోవచ్చు .. లేదు అంటే ఇది కూడా సంక్రాంతి రేసులో ముందు ఉండే సినిమా కూడా కావచ్చు ..
ఈ లెక్కలన్నీ ఇలా ఉంచితే ప్రభాస్ మూవీ సంక్రాంతికి వస్తుందా ? ఇంకా సిజి పనులు షూటింగ్ పనులు అన్ని కలిపి మూడు నెలల టైం ఉంది రాజా సాబ్ కి .. అందువల్ల ఈ సినిమాను సంక్రాంతి వరకు మెల్లగా నడుపుతారా ? లేక భనురాగపూడి సినిమాను చక చక కంప్లీట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారా .. ఇంకా 270 రోజులు టైం ఉంది .. కనుక దాన్ని ఏమైనా సంక్రాంతి వార్‌లో దింపుతారా ? అన్న విషయాల్లో కూడా క్లారిటీ రావాలి . ప్రభాస్ సినిమాని కనుక సంక్రాంతికి వస్తే ముందు ప్లాన్ చేసుకున్న చాలా సినిమాలు పక్కకు వెళ్ళిపోతాయి .. ఇది మాత్రం ఫిక్స్.