Moviesఅఖండ 2 : బోయ‌పాటి - బాల‌య్య శివ‌తాండ‌వం ఆడుస్తున్నారుగా... !

అఖండ 2 : బోయ‌పాటి – బాల‌య్య శివ‌తాండ‌వం ఆడుస్తున్నారుగా… !

నంద‌మూరి నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు ఒక‌దానిని మించి మ‌రొక‌టి సూప‌ర్ హిట్ అయ్యాయి. ఈ క్ర‌మంలో వీరి కాంబోలో వ‌చ్చిన అఖండ సూప‌ర్ హిట్ అయ్యింది. దీంతో అఖండ 2 – తాండవం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

Balayya & Boyapati: Too Late, But Too Early | cinejosh.comత‌ర్వాత షెడ్యూల్లో హిమాలయాల్లో కొన్ని ప్రదేశాల్లో బాలయ్య అఘోర పాత్ర పై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తారని తెలుస్తోంది. గతంలో ఏ సినిమాలో చూడని సీన్లు షూట్ చేసేందుకు ద‌ర్శ‌కుడు బోయపాటి ప్లాన్ చేసుకుంటున్నాడట. ఈ సన్నివేశాల్లో బాలయ్యతో పాటు జగపతి బాబు, అలాగే విలన్ పాత్రధారి ఆది పినిశెట్టి కూడా పాల్గొంటారని తెలుస్తోంది.Akhanda 2 : అఖండ 2లో బాలయ్య డైలాగ్స్ చెబితే థియేటర్ దద్దరిల్లాల్సిందే - NTV  Teluguఅఖండ‌లో అఘోరాగా విజృంభించిన బాల‌య్య తాండ‌వంలో శివ‌తాండ‌వం ఆడేస్తాడ‌ట‌. అఖండ 2 – తాండవం సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్‌ లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి.

Latest news