Moviesమహేష్ సినిమాకి నో చెప్పిన సౌందర్య .. అసలు కారణం ఇదే..!

మహేష్ సినిమాకి నో చెప్పిన సౌందర్య .. అసలు కారణం ఇదే..!

తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం భారీ క్రేజ్ తో దూసుకుపోతున్నాడు .. ఈయన దగ్గర్నుంచి వచ్చే సినిమాల కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .. ప్రస్తుతం మహేష్ రాజమౌళి తో భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు . ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది .. ఈ సినిమాల్లో మహేష్ తో పాటు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, పలువురు పాన్ ఇండియా అగ్ర నటులు నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ని కూడా రాజమౌళి నిర్వహించబోతున్నాడు . ఇప్పుడు మరో దివంగత అగ్ర నటి సౌందర్య గురించి మహేష్ బాబు గురించి క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .Mahesh Babu: ఫ్యాన్స్‌ని ఉద్దేశించి మహేశ్‌బాబు ఆసక్తికర పోస్ట్‌ |  for-all-the-love-and-support-you-have-always-shown-me-thank-you-says-mahesh- babu

ఆస‌లు మేటర్ లోకి వెళితే మహేష్ చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటించారు .. ఆ తర్వాత రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు .. మొదటి సినిమా విజయం సాధించడంతో మహేష్ తర్వాత సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా మహేష్ రెండో సినిమా యువరాజు కోసం వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వం వహించారు .. ఈ సినిమాలో ఇద్దరూ హీరోయిన్లు అవసరం ఉంటే మొదటి పాత్రకు సాక్షి శివానంద్ ను ఎంపిక చేశారు .. రెండో హీరోయిన్గా సౌందర్య అయితే బాగుంటుందని భావించారు .. ఇక స్టోరీ విన్న సౌందర్య కూడా నటించడానికి ఓకే చెప్పడంతో ఆమెని ఒకే చేశారు .టాలీవుడ్‌ రాజకుమారుడు వచ్చి అప్పుడే ఇన్నాళ్లయ్యిందా?ఇక సౌందర్య సినిమాలో నటించిన ఒకే చెప్ప‌డంతో మహేష్ బాబు , సౌందర్యతో లుక్ టెస్ట్ కూడా నిర్వహించారు .. అయితే ఆ సమయంలో ఒక్కసారిగా తన మహేష్ బాబు పక్కన హీరోయిన్గా సరిపోను అని భివించిన సౌందర్య ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు .. మహేష్ సినిమాలో నటించడం మంచి అవకాశం అయినా ఆ పాత్రలో తాను సరిపోనని భావించి సౌందర్య తప్పుకున్నారు . అయితే ఆమె స్థానంలో కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నప్పుడు సౌందర్య హీరోయిన్ సిమ్రాన్ ను తీసుకోమని సలహా ఇచ్చార . ఆమె సలహాతో చివరకు సిమ్రాన్ ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపికయ్యారు. ఇక మహేష్ బాబుతో సినిమా మిస్సయిన సౌందర్య సూపర్ స్టార్ కృష్ణతో అమ్మదొంగ , నెంబర్ వన్ వంటి సినిమాల్లో నటించారు .. తెలుగు చిత్ర పరిశ్ర‌మ‌లో అత్యంత విజయవంతమైన హీరోయిన్ లో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు .. మహేష్ బాబు , సౌందర్య కాంబోలో సినిమా రాకపోవటం అభిమానులు ఈ జంటను తేర‌పై చూసే అవకాశం మిస్సయింది.

Latest news