స్టార్ హీరోయిన్ తమన్నా గత కొన్ని సంవత్సరాలుగా లవ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే .. మిలిక్కీ బ్యూటీ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడింది .. ఈ ఇద్దరు కలిసి లాస్టర్ స్టోరీస్ 2 లో నటించారు .. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి .. అలా 2022 నుంచి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు .. ఇక వీరిద్దరి వ్యవహారం గురించి బాలీవుడ్ మీడియాలో ఎన్నో వార్తలు కూడా వచ్చాయి .. అయితే వీరి వ్యవహారం గురించి ఎవర్ని అడిగిన అలాంటిది ఏమీలేదని అంటూ కేవలం స్నేహితులు మాత్రమే అంటూ మొదట కలరింగ్ ఇచ్చారు .. కానీ విజయ్ వర్మ కుటుంబంలో జరిగిన ఓ ఫంక్షన్లో తమన్నా అక్కడ కనిపించడంతో ఆ తర్వాత ఇద్దరూ కలిసి విదేశాలకు వెళ్లిపోయారు.ఇక దాంతో విజయ్‌వర్మతో తమన్న ప్రేమలో ఉందని అందరికీ అర్థమైంది .. ఇదే సమయంలో తమ బంధం పై ఈ జంట గత ఎడాది చివర్లో కూడా క్లారిటీ ఇచ్చారు .. అలాగే వారి మధ్య ఉన్న ప్రేమని కూడా అఫీషియల్ గా బయట పెట్టారు .. మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామంటూ ఈ జంట ప్రకటించింది .. అలాగే పలు ఈవెంట్స్ లో తమన్నా తో కలిసి విజయ్‌వర్మ కనిపించారు .. అదేవిధంగా పలు ఫంక్షన్స్లో తమన్నా హ్యాండ్ బ్యాగ్లు కూడా మోస్తూ విజయ్ వర్మ కనిపించరు .. ఇక పెళ్లి అనుకుంటున్న సమయంలో లవర్ విజయ్ వర్మకు తమన్నా షాక్ ఇచ్చింది. తన లవర్ విజయ్ వర్మకు సంబంధించిన ఫోటోలు వీడియోలను తమన్న సోషల్ మీడియాలో డిలీట్ చేసింది .. అలాగే వీరిద్దరూ విడిపోయి చాలా కాలమైందని బాలీవుడ్ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి ..
తమన్నా , విజయ్ వర్మ మధ్య అభిప్రాయ భేదాలు రావడంతోనే వీరు విడిపోతున్నట్టు తెలుస్తుంది .. దీంతో తమన్నా ఖాతలో మరో బ్రేకప్ స్టోరీ వచ్చి పడింది .. ఇప్పటికే గతంలో పలువురుతో తమన్నా డేటింగ్ చేసింది .. టీనేజ్ లోనే ఓ లవ్ ఎఫైర్ నడిపిన తమన్న ఆ తర్వాత మరొకరితో రిలేషన్ కూడా మైంటైన్ చేసింది . ఇదే సమయంలో తమన్న ఓ పాకిస్తాన్ క్రికెటర్ ని కూడా ప్రేమించింది .. అతనితోనే ఆమెకు బ్రేకప్ అయిందని ప్రచారం కూడా జరిగింది .. పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ తో తమన్నా డేటింగ్ చేసిందని పలు రూమర్లు వచ్చాయి .. అలాగే వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫోటోలు సైతం అప్పట్లో బాగా వైరల్ గా మారాయి .. ఇక ఆ తర్వాత ఈ రిలేషన్ కు కూడా బ్రేక్ పడింది .. ఇక ఇప్పుడు నటుడు విజయ్ వర్మతో ఉన్న రిలేషన్ కూడా తమన్నా బ్రేకప్ చెప్పేసింది.
ఇదే సమయంలో హీరోయిన్ అనుష్క శర్మతో పెళ్లికి ముందు కోహ్లీ, తమన్నాతో డేటింగ్ చేశాడనే ప్రచారం కూడా జరిగింది . అలాగే వీరిద్దరూ గతంలో కలిసి పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించారు. ఇక దీంతో వీరి మధ్య ఏదో నడుస్తుందని అప్పట్లో బాలీవుడ్ మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి .. ఇప్పుడు విజయవర్మతో బ్రేకప్ చెప్పి బ్యూటీ మరింత హాట్ టాపిక్ గా మారింది .. అలాగే రిలేషన్ షిప్స్ పై తమన్న ఓపెన్ గా స్పందించింది .. ప్రతి చిన్న విషయంలో అబద్ధం చెప్పే వాళ్ళంటే నాకు నచ్చదని తమన్నా చెప్పుకొచ్చింది .. అతను అలాంటి వాడిని తెలియడంతో కొంతకాలానికి అతనికి బ్రేకప్ చెప్పానని కూడా చెప్పుకొచ్చింది . ప్రజెంట్ తమన్న చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .. అయితే తమన్నా చేసిన ఈ కామెంట్స్ విజయ్ వర్మ గురించి అని నేటిజెన్లు అంటున్నారు.