విడుదల తేదీ : మార్చి 14, 202
నటీనటులు : శివాజీ, ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి ఆపల్లా తదితరులు.
దర్శకుడు : రామ్ జగదీష్
నిర్మాత: నాచురల్ స్టార్ నాని
సంగీతం :విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ :దినేష్ పురుషోత్తమన్
ఎడిటర్ :కార్తీక శ్రీనివాస్ ఆర్
నాచురల్ స్టార్ నాని నిర్మాతగా ఎంతో ప్రశ్నాత్మకంగా నిర్మించిన మూవీ కోర్టు . రామ్ జగదీష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా .. శివాజీ , హర్ష రోషన్, శ్రీదేవి అప్పల , వడ్లమాని సాయి శ్రీనివాస్ , శుభలేఖ సుధాకర్, నటించారు .. అలాగే ఈ సినిమా ప్రెస్మీట్ , పలు ఈవెంట్ లో కూడా నాని తన ఇన్నెళ్ల కెరియర్లో ఈ సినిమా తప్పకుండా చూడండి అని ఎవరిని అడిగింది లేదు .. మొదటిసారి అడుగుతున్న కోర్టు సినిమాను తప్పకుండా చూడండి అంటూ మూవీ పై అంచనాలు పెంచేస్తాడు నాచురల్ స్టార్ . ఇదే క్రమంలో ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ , ట్రైలర్ కూడా మెప్పించడంతో సినిమాపై అంచానలు పెరిగిపోయాయి .. ఇలా భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చిన కోర్ట్ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం .
కథ:
ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే చందు అనే ఇంటర్ విద్యార్థి ఫెయిల్ అయి కాళీగా ఆకతాయిగా తిరుగుతూ ఉంటాడు .. ఆ గ్రామానికి చెందిన జాబిలతో లవ్ లో పడతాడు .. ఈ విషయం తెలుసుకున్న జాబిలి వాళ్ళ నాన్న తన కూతురికి చందు మాయ మాటలు చెప్పి తన బుట్టలో వేసుకున్నాడని ఉద్దేశంతో అతనిపై చట్టాన్ని ప్రయోగిస్తాడు .. చట్టంలో ఉన్న లోపాలను తనకు అనుకూలంగా మార్చుకొని ఆ కుర్రాడు మీద ఫోక్సు చట్టం కింద కేసు నమోదు చేపిస్తాడు .. ఇక దాంతో చందు ని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు .. అయితే చందు కేసు వాదించడానికి ఏ లాయర్ కూడా ముందుకు రారు అలాంటి సమయంలో .. హీరో సూర్య తేజ (ప్రియదర్శి ) ఈ కేసును తీసుకుని వాదిస్తాడు .. అలాగే చందు నిర్దోషిగా నిరూపించడానికి హీరో ఏం చేశాడు? ఎలాంటి వాదనలు వినిపించాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిస్థితులు ఏమిటి అనేది ఈ సినిమా మిగిలింది స్టోరీ..
విశ్లేషణ:
మన చట్టంలో ఉన్న లోపాలపై దర్శకుడు రామ్ జగదీష్ ఈ కథను రాసుకున్నా .. ప్రధానంగా పోక్సో చట్టంకు సంబంధించిన అనేక విషయాలను ప్రేక్షకులకు తెలిసేలా కథను తయారు చేశాడు .. అయితే ఈ సినిమాకి మొదటి భాగాన్ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు .. రెండో భాగానికి వచ్చేసరికి కాస్త తడపడినట్టు కనిపిస్తుంది .. రెండో భాగం వచ్చేసరికి సినిమా కొంత పక్కదారికి వెళ్లిపోతుందా అనే అనుమానం కూడా ప్రేక్షకుల్లో కలుగుతుంది .. అలాగే సినిమాని కొత్తగా చూపించాలని ప్రయత్నించినప్పటికీ ఇందులో కొంత చూసే ప్రేక్షకుడికి బోరు తెప్పించే సన్నివేశాలు కనిపిస్తూనే ఉంటాయి .. మొదటి భాగాన్ని ఎంతో ఎంగేజింగ్ తీసుకువెళ్లాడు .. అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం కోర్టు డ్రామా నడుస్తున్నప్పటికీ ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే సన్నివేశం ఒకటి కూడా ఉండదు .. ఈ సినిమా మొత్తం చూశాక ఏదో ఒక అసంతృప్తి మాత్రం ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటికి వస్తాడు .. ప్రేక్షకుడి ఎమోషన్స్ ను పూర్తిగా ఆకట్టుకోలేదని భావన కూడా వస్తుంది .
పర్ఫామెన్స్:
ముఖ్యంగా ఈ సినిమాలో చందు పాత్రలో నటించిన హర్ష రోషన్ తన పాత్రతో మెప్పించాడు . అలాగే కన్నా కోడుకు కోసం ఏమీ చేయలేక నిస్సహయ స్థితిలో ఉండిపోయే తల్లితండ్రులుగా నటించిన వారు కూడా బాగా నటించారు .. నటి రోహిణి తల్లి పాత్రలో అద్భుతంగా మెప్పించింది .. ఈ సినిమాకి మరో ప్లేస్ సీనియర్ నటుడు శివాజీ .. అయన నటన సినిమాకు మరో బలం .. మంగపత్తిగా శివాజీ తన పాత్రలో ఒదిగిపోయి జీవించాడు .. అలాగే తాను ప్రేమించిన ప్రియుడు తన వల్ల జైలుకు వెళ్ళాడనే బాధపడుతున్న జాబిల్లి పాత్రలో శ్రీదేవి ఎంతో బాగా నటించింది .. తెరమీద తనదైన ఎమోషన్స్ తో శ్రీదేవి మెప్పించింది .. లాయర్ సూర్య తేజ గా ప్రియదర్శి నాచురల్ నటనతో ఆకట్టుకున్నాడు .. అలాగే లాయర్ పాత్రలో ప్రియదర్శి వదుకుపోయాడని చెప్పవచ్చు .. అలాగే సినిమా సెకండాఫ్ లో కొంతవరకు ప్రియదర్శి సినిమాని తన బొజ్జాలపై వేసుకుని వెళ్లే ప్రయత్నం కూడా చేశాడు .. అయితే ప్రియదర్శిలోని ఇంకాస్త నటుడిని బయటకు తీసే సమర్థవంతమైన సన్నివేశాలు అయితే ఏమీ పడలేదు .. మిగిలినటులు తమ పాత్రకు తగ్గ నటనతో మెప్పించారు .
టెక్నికల్ టీం:
ఇక ముందుగా ఈ సినిమాలో చెప్పాలనుకున్న కాన్సెప్ట్ మరియు మెసేజ్ చాలా బాగుంది .. కథనం కూడా ఆసక్తిగానే ఉంది .. మ్యూజిక్ దర్శకుడు విజయ్ బుల్గానిన్ .. అందించిన పాటలు బాగున్నాయి .. అలాగే సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని ఎంతో న్యాచురల్ విజువల్స్ తో మెప్పించాయి .. ఈ ఎడిటింగ్ కూడా బాగానే ఉంది .. అలాగే చిత్ర నిర్మాత హీరో నాని పాటించిన నిర్మాణ విలువలు ఎంతో బాగున్నాయి .
ఫైనల్ తీర్పు:
కోర్ట్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ డ్రామాలో .. మెయిన్ కాన్సెప్ట్ తో పాటు ఫోక్సో చట్టానికి సంబంధించిన ఓ మంచి మెసేజ్ కూడా ఉంది . అలాగే కొన్ని బలమైన కోర్ట్ సన్నివేశాలు మరియు ఎమోషనల్ సీన్స్ కూడా బాగా మెప్పించాయి .. అయితే కొన్ని సన్నివేశాలు రెగ్యులర్ గానే అనిపిస్తాయి కానీ సినిమాలో ప్రధాన డ్రామా , మరియు శివాజీ , ప్రియదర్శిల నటన సినిమా స్థాయిని మరో స్థాయికి తీసుకువెళ్లాయి .. మొత్తంగా ఈ సినిమా ప్రేక్షకులను భాగానే మెప్పిస్తుంది .
చివరిగా: ఈ సినిమాకి ఇచ్చే రివ్యూ 3.2