టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై ఏపీ బీజేపీ అధ్యక్షరాలు జూనియర్ ఎన్టీఆర్‌కు మేనత్త అయిన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ తో మీ అనుబంధం ఎలా ఉంటుంది ? అన్న ప్రశ్నకు బదులిచ్చారు.ఎన్టీఆర్ అత్తగా నన్ను చాలా గౌరవిస్తాడు.. నేనంటే ఇష్టం కూడా.. పిల్లలంతా రోజు టచ్ లో ఉంటారు.. రెగ్యులర్ కాల్స్ వీడియో కాల్స్ మాట్లాడుకుంటారు.. సినిమాలపరంగా నేనేం ఎన్టీఆర్‌కు.. కళ్యాణ్ రామ్‌కు సలహాలు ఇవ్వను.. వారి ప్రొఫెషన్ లో వారు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు.. ఒక స్థాయికి కూడా చేరుకున్నారని ఆమె చెప్పారు. ఇక ఎన్టీఆర్ సినిమాలో బాగుంది నాకు నచ్చితే తప్పకుండా ఫోన్ చేసి అభినందిస్తాను అని పురందరేశ్వరి తెలిపారు. ఇక నందమూరి కుటుంబంలో కోల్డ్ వార్ నడుస్తుందన్న వార్తలు గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
జూనియర్ ఎన్టీఆర్‌ను.. కళ్యాణ్ రామ్‌ను బాలయ్య దూరం పెడుతూ వస్తున్నారని టాక్ బయట అనేక సందర్భాలలో తరచూ చర్చకి వస్తోంది. దీనిపై ఎక్కడా ఎవరు ?స్పందించలేదు. మరోవైపు బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు టాలీవుడ్ అగ్ర హీరోలు అందరూ వచ్చిన ఎన్టీఆర్ , కళ్యాణ్‌రామ్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు. దీంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని పురందేశ్వరి చెప్పడంతో ఆ వార్తలకు కొంతవరకు పులిస్టాప్ పెట్టినట్లు అయింది.
జూనియర్ ఎన్టీఆర్ సినిమా నచ్చితే మేనత్త పురందేశ్వరి ఏం చేస్తుందో తెలుసా..!
