నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ అలాగే ఊర్వశి రౌతేలా శ్రద్దా శ్రీనాథ్ లు కీలక పాత్రల్లో దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన సాలిడ్ హిట్ సినిమా “ డాకు మహారాజ్ ” . ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. బాలయ్య కెరీర్‌లోనే అత్యధికంగా రు. 180 కోట్లు రాబట్టిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.థియేట్లలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా థియేటర్స్ తర్వాత రీసెంట్ గానే ఓటిటిలో కూడా వచ్చేసింది.డాకూ మహారాజ్ ఓటీటీ హక్కులు దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా వారు ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి తీసుకొచ్చారు. ఇందులో డాకు మహారాజ్ ఎవ్వరూ ఊహించని రెస్పాన్స్ సొంతం చేసుకుంది. భారీ వ్యూస్‌తో ఓటీటీని షేక్ చేయడంతో పాటు ఇండియా వైడ్ నెంబర్ 1 స్థానంలో కూడా ట్రెండింగ్ లో ఉంది.
ఇక ఇదే ట్రెండింగ్ నెంబర్ 1 స్థానంలో ఇప్పటికీ కొనసాగిస్తోంది. మిగిలిన అన్ని హిట్ సినిమాలను మించి ఈ సినిమా డామినేష్ చేస్తూ కొనసాగడం విశేషం. దీంతో ఓటిటిలో డాకు ఎఫెక్ట్ గట్టిగానే ఉందని.. బాలయ్య మార్క్ దబిడి దిబిడి మామూలుగా లేదని అర్థమవుతోంది.