సెలబ్రిటీలపై తీవ్రమైన ఆరోపణలు వస్తే వారు వెంటనే స్పందిస్తారు.. తమపై వచ్చిన ఆరోపణలపై కామెంట్ చేయడమో లేదా ఖండన చేయడమో చేస్తారు. కానీ దర్శకధీరుడు రాజమౌళిపై వచ్చిన ఆరోపణలపై పూర్తిగా మౌనంగా ఉన్నారు. కొందరు లీగల్‌గా ప్రొసీడ్ అవుతారు. అయితే ఈ ఆరోపణలపై రాజమౌళి కాని లేదా రాజమౌళి కుటుంబం గాని పూర్తిగా మౌనాన్నే ఆశ్రయించినట్టు ఉన్నారు.రాజమౌళికి అత్యంత సన్నిహితుడిని అని చెప్పుకుంటూ ఉప్పలపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ ఆరోపణలు చేశారు. రాజమౌళితో తనది 34 ఏళ్ల అనుబంధం అని.. తాము ఇద్దరం ఒకే అమ్మాయిని ప్రేమించామని.. రాజమౌళి కోసం తాను ఆ అమ్మాయిని త్యాగం చేశానని. యమదొంగ సినిమాకు తాను ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యుసర్‌గా వ్యవహరించానని.. అయితే రాజమౌళి ఇటీవల తనను టార్చర్ పెడుతున్నాడని.. తనకు నరకం చూపిస్తున్నాడని కామెంట్లు చేశాడు.
ఈ వీడియోపై రాజమౌళి అస్సలు స్పందించలేదు. నిజానికి ఇలాంటి వీడియోలు.. ఆరోపణలపై సెలబ్రిటీలు స్పందించపోవడమే బెటర్. లేకపోతే అనవసరంగా కెలుక్కున్నట్టు ఉంటుందన్న టాక్ కూడా వస్తోంది. ఇక రాజమౌళి ప్రస్తుతం మహేష్‌బాబు 29వ సినిమాను డైరెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.