సచిన్ టెండూల్కర్ – సౌరవ్ గంగూలీ..ఆ ఇద్దరూ సమకాలిక క్రికెటర్లు. చాలా యేళ్ల పాటు భారత క్రికెట్ జట్టుకు మంచి ఓపెనింగ్ జోడీగా కూడా ఉన్నారు. ఎన్నో సూపర్ విజయాలు వీరిద్దరు కలిసి భారత జట్టుకు అందించారు. భారత క్రికెట్ గౌరవం కూడా పెంచారు. ఇక ఇప్పుడు వీరిద్దరి కుమార్తెలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారారు. సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ ఇప్పటికే పెద్ద సెలబ్రిటీ. సౌరవ్ గంగూలీ కుమార్తె సనా గంగూలీ అందం, ఆకర్షణలో టాప్. ఈ ఇద్దరి ఏజ్, విద్య అర్హతల గురించి సోషల్ మీడియాలో ఎక్కువుగా చర్చ నడుస్తోంది.
సచిన్ కూతురు సారా టెండూల్కర్ 1997 అక్టోబర్ 12న జన్మించారు. ప్రస్తుతం ఆమెకు 27 సంవత్సరాలు. సనా గంగూలీ 2021 నవంబర్ 3న జన్మించారు. ప్రస్తుతం ఈ అమ్మాయికి 23 సంవత్సరాలు. ఇద్దరి మధ్య నాలుగేళ్ల వయస్సు అంతరం ఉంది. సారా ప్రతిష్టాత్మక ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో తన ప్రారంభ విద్యను పూర్తి చేసి లండన్‌లో తన విద్యను కొనసాగిస్తోంది. సనా గంగూలీ కోల్‌కతాలోని లోరెటో హౌస్ స్కూల్‌లో తన పాఠశాల విద్యను ప్రారంభించింది. సనా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ లో చదువుతోంది. వర్శిటీలో ఈ యంగ్ బ్యూటీ ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించింది. ఏదేమైనా ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్ల కుమార్తెలు తమ రంగాల్లో ఉన్నత స్తానాల్లోకి వెళతారని అందరూ ఆశిస్తున్నారు.