క సినిమాతో విజయం కంటే భారీ రెస్పెక్ట్ తెచ్చుకున్న హీరో కిరణ్ అబ్బవరం .. ఈ హీరో దగ్గర్నుంచి వచ్చిన తాజా మూవీ “దిల్ రుబా” .. విశ్వ కిరణ్ దర్శకుడుగా పరిచయమైన ఈ సినిమా విడుదల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది .. అయితే పాటలు మంచి హిట్ అవ్వటం ప్రమోషనల్ కంటెంట్ జనాల్లోకి పోవడంతో సినిమాపై అంచనాలు పేరిగాయి .. ఈ సినిమా ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. ఇక మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో మెప్పించిందో ఇక్కడ చూద్దాం.
స్టోరీ:
సిద్దు (కిరణ్ అబ్బవరం) ఒకేరోజు తాను గౌరవించే తండ్రిని చిన్నప్పటి నుంచి ప్రేమించిన మేఘన (క్యాతీ డావిన్సన్) ను కోల్పోతాడు
. అలా ఇద్దరూ తన అనుకున్న మనుషులు ఒకేసారి దూరం అవటంతో ఇకపై ఎవరికి దగ్గరవ్వకూడదు అని నిర్ణయం తీసుకుని మంగళూరులోని కాలేజీలో ఇంజనీరింగ్ జాయిన్ అవుతాడు .. ఇక అక్కడ పరిచయం అవుతుంది అంజలి … ఆమె పరిచయంతో సిద్ధులు కొంత మార్పు వస్తుందనుకుంటున్న సమయంలో అంజలి (రుక్సార్). కూడా సిద్దు ని వదిలేసి వెళ్ళిపోతుంది .. అసలు ఇంత మంది సిద్ధుని ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నారు ? సమస్య ఎక్కడి నుంచి వచ్చింది .. సిద్దు క్యారక్టర్ ? లేక అతని ఆటిట్యూడ్ ? అనేది థియేటర్లో చూడాల్సిందే.
విశ్లేషణ:
ప్రేమ కథల్లో ఎన్నో రకాలు ఉంటాయి .. ఒక్కో ప్రేమ కథ ఒక్కో ఎమోషన్ .. అయితే ఆ ఎమోషన్ ను సరిగా పండించగల్గటం , ముఖ్యంగా ఆడియన్స్ ను ఆ ఎమోషన్ను కనెక్ట్ అయ్యేలా చేయటం అనేది ఒక ప్రేమకథ సక్సెస్లో కీలక పాత్ర పోషిస్తుంది .. దిల్ రుబా లో ఆ ఎమోషనల్ కనెక్టివిటీ మాత్రం కొంత మిస్ అవుతుంది . ఫైట్ సీన్స్ బాగున్న .. వాటిలోని ఇంటర్సిటీకి మ్యాచ్ అయ్యే స్థాయి సన్నివేశాలు లేకుండా ఉన్నాయి .. అలాగే సినిమాలో విలనిజంను కొత్తగా చూపించడానికి చేసిన ప్రయత్నం కూడా సినిమాకు భారీగా దెబ్బ కొట్టింది .. అయితే యూత్ ఆడియన్స్ , కాలేజీ స్టూడెంట్స్ మాత్రం ఒక్కసారి చూడడానికి ప్రయత్నించవచ్చు.
నటీనోటెల్ పర్ఫామెన్స్:
నటీనటుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే కిరణ్ ఇంతకుముందు సినిమాల్లో చాలా బాగా నటించి మెప్పించాడు .. కానీ ఈ సినిమాల్లో మాత్రం అంత పెద్దగా తన ప్రతిభను చూపించలేకపోయాడు .. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ లో తన మార్క్ కనిపించేలా భారీ రిస్కీ షాట్స్ అయితే చేశాడు .. కానీ నటన పరంగా మాత్రం ఆయన పెద్దగా ప్రేక్షకుడిని మెప్పించుకోలేకపోయాడు .. అయితే హీరోయిన్లుగా చేసిన ఇద్దరు అమ్మాయిలు సైతం ఏమాత్రం ఆకట్టుకోలేదు. వారి పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించినప్పటికీ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయారు .. ఇక కీలక పాత్రలో నటించిన జాన్ విజయ సైతం బాగా నటించి మెప్పించే ప్రయత్నం చేశాడు.
సాంకేతిక వర్గం పనితీరు:
ఇక సినిమా టెక్నికల్ విషయానికి వస్తే సామ్ సి.ఎస్ మ్యూజిక్ సినిమాకి కొంతవరకు ప్లస్ అయింది .. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఆయన స్పెషల్ కేర్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది .. ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమా మూడ్‌ను చెడగొట్టకుండా చాలా బాగా ఇచ్చినప్పటికీ సినిమాలో కంటెంట్ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోవటంలో దర్శకుడు దాన్నీ స్క్రీన్ మీద సరిగ్గా లేకపోవడం తో సినిమా ఆశించిన మేరకు మెప్పించలేకపోయింది.
ప్లస్ పాయింట్స్:
మ్యూజిక్
యాక్షన్ ఎపిసోడ్స్
మైనస్ పాయింట్స్:
స్టోరీ
స్క్రీన్ ప్లే
హీరో యాక్టింగ్
చివరగా: క సినిమాతో మంచి సినిమా తీసి మరో మెట్టు ఎక్కాల్సిన కిరణ్ తర్వాత అడుగులు తడబడ్డాడు.
రేటింగ్: 2/5