టాలీవుడ్ లో కొందరు హీరోలు వారసులు ఎప్పటి నుంచో సినిమాల్లోకి రావడం మామూలే. ఎన్టీఆర్వారసుడు బాలయ్య, ఏఎన్నార్ వారసుడు నాగార్జున స్టార్ హీరోలుగా మూడున్నర దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక తర్వాత తరంలో సూపర్‌స్టార్ కృష్ణ తనయుడు మహేష్‌బాబు.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు.
ఇక తర్వాత తరంలో బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ కూడా సినిమా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. టాలీవుడ్ లో తర్వాత తరం వారసులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరానందన్ – మహేష్ బాబు తనయుడు గౌతమ్ – వెంకటేష్ కొడుకు కూడా సినిమాల్లోకి రానున్నారు. ఇక పవన్ వారసుడు అకిరా నందన్ ఎంట్రీపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.
ఇక ఓజీ సినిమా కోసం అకీరా వర్క్ చేస్తున్నట్టు థమన్ ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉన్నా అకీరా నటుడిగా.. అందులోనూ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడనేది ఆసక్తికరం. మరో రెండేళ్ల తర్వాత వెండి తెరపై అకీరా హీరోగా పరిచయం కాబోతున్నాడట. సో రెండేళ్ల తర్వాత పవన్ ఫ్యాన్స్‌ను శాటిస్‌పై చేసేందుకు అకీరా హీరో అయిపోతున్నాడు.