నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సీక్వెల్ అఖండ టు తాండవంలో నటిస్తున్నారు. ఈ సంక్రాంతికి బాబీ దర్శకత్వంలో బాలయ్య నటించిన డాకు మాహారాజు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దాదాపు 180 కోట్ల వసూలు రాబట్టిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా రికార్డుల్లో నిలిచింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం బాలయ్య కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. బాలయ్య డాకూ మహారాజ్ సినిమా కోసం రు. 28 కోట్లు తీసుకున్నాడట. ఈ సినిమా తర్వాత బాలయ్యకు వరుసగా నాలుగు హిట్లు పడినట్లైంది. ఈ క్రమంలోనే అఖండ 2 కోసం బాలయ్య మరో రు. 7 కోట్లు పెంచి రు. 35 కోట్లు వరకు ఇస్తున్నారట.
ఇదేమి బాలయ్య డిమాండ్ కాదు.. బాలయ్య వరుస హిట్లతో ఫామ్‌లో ఉండడంతో నిర్మాతలే బాలయ్యకు ఈ సినిమా కోసం రు. 35 కోట్ల రెమ్యునరేషన్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక అఖండ 2 సినిమాను దసరాకు రిలీజ్ చేసే ప్లానింగ్ నడుస్తోంది.