టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఈ సంక్రాంతికి వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత చరణ్ నటిస్తున్న భారీ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది.
ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. త్రిబుల్ ఆర్ తర్వాత అంచనాలు అన్నీ ఈ సినిమా మీదే అభిమానులు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ కూడా ఈ యేడాదిలోనే ఉంటుందన్న టాక్ కూడా బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా మేకర్స్ లాక్ చేసినట్టు తెలుస్తోంది.
ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 16న థియేటర్స్ లో సందడి చేసేందుకు రాబోతుందట.
దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు అలాగే వృద్ధి సినిమాస్ మరియు మైత్రిమూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.