Moviesబాల‌య్య‌కు న‌చ్చిన హీరోయిన్ల‌లో ప్ర‌గ్య జైశ్వాల్ ర్యాంక్ ఎంత‌..?

బాల‌య్య‌కు న‌చ్చిన హీరోయిన్ల‌లో ప్ర‌గ్య జైశ్వాల్ ర్యాంక్ ఎంత‌..?

నందమూరి బాలకృష్ణ ఇప్పటికే తన కెరీర్లో 109 సినిమాలలో నటించారు. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న అఖండ 2 తాండవం సినిమా 110 వ‌ సినిమా. బాలయ్య ఇన్నేళ్ల‌ కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో నటించారు.. ఇంకా నటిస్తూనే ఉన్నారు. మరి ఇంత మంది హీరోయిన్లలో బాలకృష్ణకు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు ? అన్న ప్రశ్నకు బాలయ్య నుంచి ఆసక్తికరమైన సమాధానం వచ్చింది. తన కెరీర్ మొత్తం మీద తనకు బాగా నచ్చిన హీరోయిన్లు ఎవరో చెప్పుకొచ్చారు. బాలకృష్ణ తను నటించిన హీరోయిన్లలో బాలకృష్ణకు బాగా నచ్చిన హీరోయిన్ విజయశాంతి.

Balakrishna's passion for cinema unmatchable: Pragya Jaiswal

లేడీ అమితాబచ్చన్ విజయశాంతి – బాలయ్యది ఒకప్పుడు హిట్ కాంబినేషన్. అంతకు మించిన అనుబంధం వీరిద్దరిది. అందుకే తన టాప్ హీరోయిన్ల లిస్టులో మొదటి స్థానం విజయశాంతిదే అని ప్రకటించారు బాలయ్య. విజయశాంతి తర్వాత రమ్యకృష్ణ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు బాలయ్య. వీరిద్దరిది కూడా హిట్ కాంబినేషనే అయితే రమ్యకృష్ణ మొదటి స్థానం ఇవ్వలేదు.

ఇక టాప్ త్రీ లో మూడో స్థానం సిమ్రాన్ కు ఇచ్చారు. బాలకృష్ణ సిమ్రాన్ కలిసి సమరసింహారెడ్డి – నరసింహనాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్స్ సినిమాలతో పాటు సీమ సింహం లాంటి సినిమాలలో కూడా నటించారు. ఇక బాలయ్యకు ఇటీవల కాలంలో వరుసగా హిట్లు ఇస్తున్న ప్ర‌గ్య జైశ్వాల్ పేరు ఆయన చెప్పలేదు. అయితే బాలయ్యకు నచ్చిన టాప్ టెన్ హీరోయిన్ల లిస్టులో ప్రగ్య జైశ్వాల్ పేరు కచ్చితంగా ఉండవచ్చని అంటున్నారు.

Latest news