టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య .. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా తండేల్. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై యువ నిర్మాత బన్నీ వాసు నిర్మిస్తున్నారు. యదార్థ ప్రేమ సంఘటన కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 7న గ్రాండ్గా థియేటర్లలోకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో మూవీ టీం ప్రమోషన్ జోరు పెంచింది. తాజాగా హైదరాబాదులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రెండ్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఈ కార్యక్రమంలో నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళ్ల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. చైతు మాట్లాడుతూ ఇంట్లో శోభితను బుజ్జి తల్లి అనే పిలుస్తాను.. ఈ సినిమాలో హీరోయిన్ ని కూడా అలాగే పిలుస్తూ ఉంటా అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చైతు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంతతో విడాకులు తర్వాత నాగచైతన్య స్టార్ హీరోయిన్గా ఉన్న శోభిత దూళిపాళ్లతో మూడేళ్ల పాటు డేటింగ్ చేసి ప్రేమలో మునిగి ఆ తర్వాత పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే గత ఏడాది చివర్లో డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో మూడుముళ్ల బంధంతో ఒక్కటే అయ్యారు. ఈ మ్యారేజ్ తర్వాత చైతన్య సినిమాలు చేస్తుంటే ..శోభిత మాత్రం సోషల్ మీడియాలో నిత్యం లేటెస్ట్ ఫోటోలతో అభిమానులకు దగ్గరవుతోంది.