చాలా రోజుల తర్వాత పబ్లిక్ ఫ్లాట్ ఫారం మీదకు హీరో అల్లు అర్జున్ వస్తాడని అందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూశారు. మరియు ముఖ్యంగా బన్నీ నటించిన పుష్ప 2 సినిమా రిలీజ్ కు ముందు రోజు హైదరాబాదులోని సంధ్య ధియేటర్ దగ్గర జరిగిన సంఘటన తర్వాత బన్నీ చాలా ఇబ్బందులకు గురయ్యారు. సినిమా ఎంత పెద్ద హిట్ అయినా దానిని సరిగా ఎంజాయ్ చేయలేని పరిస్థితి. ఇక తండేల్ జాతర అంటూ ఏర్పాటు చేసిన ఫ్రీ రిలీజ్ ఫంక్షన్‌కు బన్నీ వస్తారని ప్రకటించారు. అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది.
ఇది ఇన్ హౌస్ ఫంక్షన్ కావడంతో చాలా కొద్ది మందిని మాత్రమే పిలిచారు.. అందువలన కచ్చితంగా బన్నీ వస్తారని అందరూ అనుకున్నారు. దీనికి పోలీసు పర్మిషన్ కూడా అవసరం లేదు.. ముందు రోజు అనుకున్న వివిధ కారణాల వల్ల ఒకరోజు వాయిదా వేశారు. అది కూడా కచ్చితంగా బన్నీ రాక కోసమే అని అందరూ అనుకున్నారు.. కానీ బన్నీ రాలేదు. ఈవెంట్ ముగిసే టైం కు అయినా బన్నీ వస్తాడని అందరూ ఆశతో ఎదురు చూశారు.. అయినా రాలేదు. బన్నీ కాలు స్లిప్ అయ్యి మెలిక తిరగడంతో ఇబ్బంది పడుతున్నాడని అందుకే రాలేదన్న పుకారు వచ్చింది.
ఇదే జరిగి ఉంటే అల్లు అరవింద్ వేదిక మీద చెప్పి ఉండేవారు. మరో గుసగుస ప్రకారం బన్నీ తండేల్ సినిమా చూశారని అవుట్ ఫుట్ విషయంలో ఆయన సంతృప్తిగా లేరని.. ఇప్పుడు వేదిక మీదకు వస్తే కచ్చితంగా హిట్ సూపర్ హిట్ లాంటి మాటలు చెప్పాల్సి వస్తుందని అందుకే రాలేదని అంటున్నారు. ఈ సినిమాకు నిర్మాత అల్లు అరవింద్ తో పాటు తనకు అత్యంత సన్నిహితుడు స్నేహితుడైన బన్నీవాస్ అలాంటి సినిమా ఫంక్షన్కు బన్నీ డుమ్మా కొట్టారంటే బలమైన కారణం కచ్చితంగా ఉండి ఉంటుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.