నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా సినిమాను డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా ఇది ప్రాజెక్టు తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ వచ్చాక ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు నిర్మాతలు రుద్ర అనే టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఇలాంటి పవర్ ఫుల్ టైటిల్తో కళ్యాణ్ మూవీ వస్తుండడంతో అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ .. లేడీ అమితాబచ్చన్ విజయశాంతి ఓ కీలకపాత్రలో నటిస్తుండగా.. సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత కళ్యాణ్ రామ్ – విజయశాంతి కలిసి స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. గతంలో బాలకృష్ణ సినిమాలో కళ్యాణ్ రామ్ – రాశి బాల నటులుగా కనిపించారు. ఇక ఈ సినిమాకు రుద్ర అనేటట్లు ఫిక్స్ చేయడంతో అంచనాలు అయితే మామూలుగా లేవు. మరి కళ్యాణ్‌రామ్ టైటిల్‌కు తగినట్టుగా ఓ పవర్ ఫుల్ హిట్ తన ఖాతాలో వేసుకుంటాడేమో ? చూడాలి.
కళ్యాణ్‌రామ్ కొత్త సినిమాకు ఈ పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్ … !
