దర్శకుడు కొల్లి బాబి దర్శకత్వంలో నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన డాకూ మహారాజ్ సినిమా నెట్ ప్లీక్స్‌లో సంచలన రికార్డులు నెలకొల్పుతూ దూసుకుపోతోంది. ఈనెల 20వ తేదీ అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమైన తర్వాత వరల్డ్ వైడ్ గా ఎనిమిది రోజులు పాటు ఈ సినిమా నెంబర్ వన్ మూవీగా నిలిచింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 కేవలం 7 రోజుల పాటు నెంబర్ వన్ నిలిచింది.అయితే ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా పుష్ప 2 రికార్డును బద్దలు కొట్టి ఎనిమిది రోజులు పాటు నెంబర్ వన్ గా నిలిచింది. డాకు మహారాజ్ ఇప్పటికీ ఇండియాతో పాటు పాకిస్తాన్ – బంగ్లాదేశ్ – ఖతర్ – యూఏఈ దేశాలలో టాప్ ట్రెండింగ్‌లో నెంబర్ వన్ గా నిలిచింది. మరో 13 దేశాలలో టాప్ టెన్ లో ఒకటిగా నిలిచింది. పాకిస్తాన్‌లో డాకు మహారాజు చూసి అక్కడ జనాలు పిచ్చెక్కిపోతున్నారు. మన దగ్గర తమిళం, మలయాళం, కన్నడం, హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది.. అన్ని భాషలలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. పుష్ప 2 కేరళలో అట్టర్ ప్లాప్ అయిన విషయం తెలిసిందే. అయితే మలయాళీలు డాకు మహారాజ్ సినిమా చూసి ఉర్రూతలూగి పోతున్నారు.
ఈ సినిమా విజువల్ ఫీస్ట్ అని.. మాస్ స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోయిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. స్ట్రీమింగ్ అయ్యే నాన్ ఇంగ్లీష్ సినిమాలలో వరల్డ్ వైడ్‌గా డాకు మహారాజ్ ఐదవ స్థానం సంపాదించింది. తన ఇండియా సౌత్ పేజి డిస్క్రిప్షన్ లో డాకు మహారాజును ఉద్దేశించి ప్రణామ్ మహారాజు అనే ట్యాగ్ లైన్ పెట్టింది అంటే ఏ స్థాయిలో రెస్పాన్స్ అవుతుందో అర్థం చేసుకోవాలి. ఈ ఊపు చూస్తుంటే డాకూ మహారాజ్ సినిమా భవిష్యత్తులో ఏ రేంజ్ లో రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.
పుష్ప 2 రికార్డును బ్రేక్ చేసిన డాకూ మహారాజ్… బాలయ్య దబిడి దిబిడి దెబ్బ…!
