గతేడాది సంక్రాంతికి వచ్చిన పాన్ ఇండియా హిట్ హనుమాన్ తరవాత దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు మార్మోగిపోయింది. దేశవ్యాప్తంగానే ప్రశాంత్ వర్మ పేరు పాపులర్ అయ్యింది. ఇక బాలీవుడ్ హీరోలు సైతం.. ప్రశాంత్ వర్మతో పని చేయడానికి ఎంతో ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే రణవీర్‌సింగ్ కు ఓ కథ కూడా చెప్పాడు. అదే బ్రహ్మరాక్షస్. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ రణ్‌వీర్ సింగ్ తో ఫోటో షూట్ కూడా చేశారు.అయితే కొన్ని ఇబ్బందులతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తరవాత మోక్షజ్ఞతో ఓ సినిమా అనుకొన్నారు. అది ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో తెలియదు. ఇప్పుడు బ్రహ్మరాక్షస్ ప్రాజెక్ట్‌ని మళ్లీ పట్టాలెక్కించడానికి రంగం సిద్ధమవుతోందట. ఈ సారి ప్రభాస్ – ప్రశాంత్ వర్మతో జట్టు కట్టడానికి ముందుకు వచ్చాడు. ప్రభాస్‌తో ప్రశాంత్ వర్మ ఓ సినిమా చేస్తాడని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది.
ఇప్పుడు అదే నిజం అవుతోంది. బ్రహ్మరాక్షస్ చేయడానికి ప్రభాస్ ఉత్సాహం చూపిస్తున్నాడని, ఈ ప్రాజెక్ట్ ఓకే అయిపోయిందని ఇన్ సైడ్ వర్గాల టాక్. రాజాసాబ్, ఫౌజీ తర్వాత స్పిరిట్ తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లవచ్చు.
ప్రభాస్ – హనుమాన్ వర్మ సినిమా టైటిల్ ఇదే.. !
