Moviesధ‌నుష్ - నాగార్జున మ‌ల్టీస్టార‌ర్ ' కుబేర ' రిలీజ్ డేట్...

ధ‌నుష్ – నాగార్జున మ‌ల్టీస్టార‌ర్ ‘ కుబేర ‘ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది..!

టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కుబేరు. ఈ సినిమాలో ధనుష్ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ బిచ్చగాడిలా నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ తాజాగా మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. సినిమా రిలీజ్ డేట్ బ‌య‌ట‌కు రావ‌డంతో అటు ధ‌నుష్‌, ఇటు నాగార్జున అభిమానుల‌కు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌. 2025లో మూవీ లవర్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో ఇది కూడా ఒకటి.Official: #Dhanush - #Nagarjuna in #Kubera movie Teaser will be unveiled on  November 15th!! @dhanushkraja @svcllp #dhanushfan #dhanushkraja  #rashmikamandanna #rashmikaఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఇప్ప‌టికే ఎన్నో పుకార్లు వ‌చ్చాయి. వాటికి ఫుల్‌స్టాప్ పెడుతూ మేక‌ర్స్ జూన్ 20న కుబేరను థియేట్రిక‌ల్‌గా రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. విడుదల తేదీ పోస్టర్‌లో నాగార్జున, ధనుష్‌లు దిగులుగా, వారి చూపుల్లో ఉన్న తీవ్రత ఆసక్తిని రేకెత్తిస్తోంది. శేఖ‌ర్ క‌మ్ముల రిలీజ్ డేట్ విష‌యంలో పెద్ద ప్లానే వేశాడంటున్నారు. జూన్ 10 నుంచి స‌మ్మ‌ర్ ఉంటుంది. సినిమాకు హిట్ టాక్ వ‌స్తే క‌లెక్ష‌న్లు కుమ్మేయ‌డం ఖాయం.ఫస్ట్ గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కేబేర‌ తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Latest news