నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన తాజా సినిమా డాకూ మహారాజ్. ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే హయ్యస్ట్ వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా థియేటర్లలో ఏకంగా రు. 180 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఇప్పుడు డాకు మహారా ఓటీటీలో అదరగొడుతుండగా ఇపుడు ఈ ఈ సినిమా తర్వాత బాలయ్య నుంచి సాలిడ్ ప్రాజెక్ట్ గా “అఖండ 2” స్టార్ట్ చేశారు.దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై పాన్ ఇండియా రేంజ్‌లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా రు. 180 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఇక అఖండ 2 షూటింగ్ ఒకపక్క ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. అయితే ఒక్క షూటింగ్ తో పాటు అటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో కూడా చేసేస్తున్నారట. ఇక అఖండ 2 ఇంటర్వెల్ ఎపిసోడ్ గ్రాఫిక్స్ పనులు స్టార్ట్ చేసేసారట.
ఈ సినిమాను 14 రీల్స్ సంస్థ నిర్మిస్తుండగా… థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే దసరా రోజు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
రాకెట్ స్పీడ్‌తో ‘ అఖండ 2 ‘ .. అప్పుడే ఎక్కడి వరకు అంటే..!
