టాలీవుడ్‌లో 8 వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలతో తీసుకుపోతున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా రూపొందించే ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే సంక్రాంతి రిలీజ్ టార్గెట్‌గా ఈ సినిమా అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా బడ్జెట్.. లెక్కలు చూస్తుంటే వర్కవుట్ అయ్యేలా లేదు. ఈ సినిమా కోసం చిరు రు. 75 కోట్లు తీసుకుంటూ ఉండగా.. బ్యానర్ ఇచ్చినందుకు చిరు పెద్ద కుమార్తె సుస్మితకు మరో రు. 10 కోట్లు మొత్తం రు. 85 కోట్లు తీసుకుంటున్నారట.ఇక దర్శకుడు అనిల్ రావిపూడి ఫామ్ నేపథ్యంలో రు. 25- 30 కోట్లు ఇస్తారు. మిగిలిన రెమ్యునరేషన్లు.. షూటింగ్ కాస్ట్.. వడ్డీలు అన్నీ కలిపి రు. 100 కోట్లు ఉంటాయి. అంటే ఈ సినిమా బడ్జెట్ పేపర్ మీద 220 కోట్లు కనిపిస్తోంది. మరో 10 నుంచి 20 కోట్లు అదనంగా అయినా అవుతుంది. ఈ లెక్కన రు. 220 కోట్లు రావాలంటే పేద్ద హిట్ అవ్వాలి. ఎంత చిరు అయినా కథ బాగోపోతే ఆచార్య – సైరా – భోళాశంకర్ ఫలితమే వస్తుంది. ఇక నాన్ థియేటర్ రైట్స్ ఉంటాయన్న ధీమా లేదు. చిరు విశ్వంభర రు. 50 కోట్లు చెపుతుంటే ఎవ్వరూ రావట్లేదు.
ఇక సంక్రాంతికి వస్తున్నాం కేవలం 70 రోజుల్లో 30 కోట్ల బడ్జెట్‌తో పూర్తి చేశారు. మరి చిరు సినిమాకు రు. 220 కోట్లు అయ్యేలా ఉంది. పైగా విశ్వంభర తేడా కొడితే చిరు – అనిల్ రావిపూడి సినిమా బిజినెస్ మీద ప్రభావం ఉంటుంది. ఏదేమైనా ఈ సినిమా నిర్మాత సాహు గారపాటికి పెద్దగా ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అవ్వకపోవచ్చని అంటున్నారు.
మెగాస్టార్ – అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ వర్కవుట్ అవ్వదా… నిర్మాతలకు బొక్కేనా..!
