ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన 29 ఏళ్ల వైవాహిక జీవితానికి పుల్ స్టాప్ పెడుతూ తన సతీమణి సైరా భానుతో విడిపోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే వారిద్దరు విడాకులు తీసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో కూడా బాగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత విడాకులపై రెహమాన్ భార్యా సైరా భాను మాట్లాడుతూ తమ మధ్య అంతులేని దూరం పెరిగిపోయిందని.. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని కూడా చెప్పుకొచ్చింది. చాలామంది దాదాపు 30 సంవత్సరాలు కలిసి కాపురం చేసిన రెహమాన్ విడాకులు తీసుకోవడం ఏంటి ? అని షాక్ అయ్యారు.రెహమాన్ అభిమానులు ఎంతో మంది బాధపడ్డారు. తాజా సమాచారం ప్రకారం ఈ జంట తిరిగి కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నట్టు నడుస్తోంది. ఇటీవల సైరాభాను అనారోగ్యంతో బాధపడితే ఏఆర్ రెహమాన్ అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సైరాభాను తరపున లాయర్ బయటపెట్టింది. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో రెహ్మన్ ఆమెకు అండగా నిలిచాడు అంటూ సైరాబాను కూడా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య మళ్లీ ప్రేమ చిగురిస్తుందని.. మళ్లీ కలిసిపోయే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 1995లో సైరాభాను అని పెళ్లాడిన ఏఆర్ రెహమాన్ కి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఏఆర్ రెహ్మన్ విడాకులు వెనక్కి… ఇంతలో ఏం జరిగింది..?
