మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా గురించి ఇప్పటికే ఓ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం చిరంజీవి మల్లిడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ ఈ సినిమా నిర్మిస్తోంది. సమ్మర్ కానుకగా మే నెలలో రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ నడుస్తోంది. ఇదిలా ఉంటే విశ్వంభర తర్వాత చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ లో నటించబోతున్నట్టు చిరంజీవి స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా వేసవిలో ప్రారంభం అవుతుందని.. వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇది కంప్లీట్ వినోదాత్మక చిత్రం అని ఈ మూవీ సెట్స్ లో అడుగు పెట్టేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఉన్నానని కూడా చిరంజీవి స్వయంగా చెప్పారు.అయితే సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు తెలుస్తోంది. అనిల్ రావిపూడి చెప్పే సీన్లు గురించి కూడా మెగాస్టార్ చెపుతూ సినిమాలో ఆయా సన్నివేశాల గురించి దర్శకుడు చెబుతుంటే.. కడుపుబ్బ నవ్వుతున్నాను అని.. గతంలో దర్శకుడు కోదండరామిరెడ్డి తో పనిచేసిన సమయంలో ఎలాంటి ఫీలింగ్ ఉందో.. ఇప్పుడు అనిల్ తో అలాంటి ఫీలింగే ఉందన్నారు. ఈ సినిమాంగా కచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది అని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తెలిపారు. ఈ క్రేజీ ప్రాజెక్టును షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారపాటి.. చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత సంయుక్తంగా నిర్మిస్తారు.
అనిల్ రావిపూడి – చిరంజీవి సినిమాలో రెండు క్రేజీ ట్విస్టులు..?
