టాలీవుడ్‌లో జూనియర్ పవన్ కళ్యాణ్ గా అభిమానులు ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరానందన్ సినీ ఎంట్రీకి సంబంధించి తెలుగు సినీ అభిమానులతో పాటు మెగాభిమానులు ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. అయితే దీనికి తెరవెనక చాలా కసరత్తులు నడుస్తోన్న ఇన్సైడ్ టాక్. ఈ సినిమా దర్శకుడు.. కథ తదితర అంశాల మీద వీలు దొరికినప్పుడల్లా పవన్ మిత్రులు చర్చల్లో పాల్గొంటున్నారట.ఈ టీంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నాగవంశీ, ఆనంద సాయి కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఇంకో రెండు సంవత్సరాల తర్వాత అకీరాను పరిచయం చేసినా సరే ప్లానింగ్ అదిరిపోయేలా ఉంటుందట. అలా ఉండాలనే గట్టి ప్లానింగ్ చేస్తున్నారట. ఈ టీంతో తరచూ చర్చల్లో పాల్గొంటున్నారట. ఇక టాలీవుడ్ వారసుల కోసం ఎదురు చూస్తోన్న హీరోల్లో రెండు పేర్లే ప్రధానంగా వినిపిస్తున్నాయి. మొదటిది బాలయ్య వారసుడు మోక్షజ్ఞ అయితే.. రెండోది పవన్ కొడుకు అకీరానే.
పవన్ ఇటు రాజకీయాలతో పాటు సినిమాల పరంగా హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ లకే డేట్లు ఇవ్వలేక సతమతమవుతున్నారు. ఇవి రిలీజయ్యాక పవర్ స్టార్ ఎంత వరకు సినిమాలు చేస్తాడు ? అన్నది డౌటే. అప్పటి లోగా అకీరాను లైన్లో పెట్టేసేలా ప్లాన్ నడుస్తోంది.
పవన్ కొడుకు అకీరా ఎంట్రీ వెనక ఇంత కసరత్తు నడుస్తోందా.. !
