Moviesబాల‌కృష్ణ‌కు ఇష్ట‌మైన ఈ ముగ్గురు హీరోయిన్లు తెలుసా.. అంద‌రూ వాళ్లేగా...!

బాల‌కృష్ణ‌కు ఇష్ట‌మైన ఈ ముగ్గురు హీరోయిన్లు తెలుసా.. అంద‌రూ వాళ్లేగా…!

నందమూరి బాలకృష్ణ ఈ యేడాది సంక్రాంతి డాకు మహారాజ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 లో నటిస్తున్నారు. ఈ యేడాది పర్సనల్గా బాలయ్యకు గ్రాండ్గా ప్రారంభం అయింది. ఇటు సంక్రాంతికి సూపర్ హిట్ సినిమా కొట్టిన బాలయ్య కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే పద్మభూషణ్‌ అవార్డుకి కూడా ఎంపికయ్యారు. దశాబ్దాలుగా తెలుగు సినిమా రంగంలో బాలయ్య అందిస్తున్న సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించింది. తన సోదరుడికి పద్మభూషణ్‌ అవార్డు దక్కడంతో నారా భువనేశ్వరి రీసెంట్గా గ్రాండ్ పార్టీ ఇచ్చారు.

హైద‌రాబాద్‌లో జ‌రిగిన‌ ఈ పార్టీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. బాలయ్య తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించారు. ఈ పార్టీలో భువనేశ్వరి తన సోదరుడని కొన్ని ప్రశ్నలు సరదాగా అడిగారు. కెరీర్లో నీకు ఇష్టమైన ముగ్గురు హీరోయిన్లు ఎవరు ? అని భువనేశ్వరి అడిగారు. దీనికి బాలిక సమాధానం ఇస్తూ ముగ్గురు క్రేజీ హీరోయిన్ల పేర్లు చెప్పారు. అయితే ఈ తరం హీరోయిన్లు ఒకరు కూడా లేరు.

విజయశాంతి – రమ్యకృష్ణ – సిమ్రాన్ తనుకు ఇష్టమైన హీరోయిన్లు అని బాలయ్య పేర్కొనటం విశేషం. వీరి ముగ్గురితో బాలయ్య అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. విజయశాంతితో బాలయ్య లారీ డ్రైవర్, ముద్దుల మావయ్య, రౌడీ ఇన్స్పెక్టర్, మువ్వా గోపాలుడు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఇక రమ్యకృష్ణతో బంగారు బుల్లోడు, దేవుడు, వంశానికొక్కడు లాంటి చిత్రాల్లో నటించారు. సిమ్రాన్ తో అయితే బాలయ్య తన కెరీర్ బెస్ట్ చిత్రాల్లో నటించడం విశేషం. సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు చిత్రాల్లో సిమ్రాన్, బాలయ్య కలసి నటించారు.

Didn't have courage to leave my career in Telugu cinema for Bollywood: Ramya  Krishnan

Latest news