సరిగ్గా ఏడాది కిందట సంగతి 2024 జనవరి సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య మహేష్ బాబు గుంటూరు కారం సినిమా వచ్చింది. అండర్ డాగ్ గా ఎలాంటి అంచనాలలో లేకుండా హనుమాన్ సినిమా రిలీజ్ అయింది. ఇక సీనియర్ హీరోలు వెంకటేష్ నటించిన సైంధవ్ – నాగార్జున నా సామి రంగా సినిమాలు కూడా వచ్చాయి. రిజల్ట్ ఏంటో అందరం చూశాం. భారీ అంచనాలతో వచ్చిన గుంటూరు కారం ప్లాప్ అయ్యింది. అండర్ డాగ్ గా వచ్చిన హనుమాన్ పాన్ ఇండియా సినిమాగా హిట్ అయింది. సైంధవ్ డిజాస్టర్ అయింది. నా సామి రంగా జస్ట్ బిలో యావరేజ్ సినిమా అయింది. సేమ్ టు సేమ్ అదే ఫలితం ఈ ఏడాది జనవరిలో కూడా రిపీట్ అయింది. అరివిర భయంకరమైన అంచనాలతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ గేమ్ ఛేంజర్ సినిమా వచ్చింది. బాలయ్య డాకు మహారాజ్ సినిమా కూడా అంచనాలపరంగా గేమ్ ఛేంజర్ తర్వాత స్థానంలో నిలిచింది.ఇక వెంకటేష్ నటించిన సంక్రాంతి కివస్తున్నాం సినిమా ఓ మోస్తరు అంచనాలతో చిన్న టార్గెట్ తో రిలీజ్ అయింది. గత సంక్రాంతికి అంచనాలు లేని హనుమాన్ ఎంత పెద్ద హిట్ అయిందో .. ఈ సంక్రాంతికి కూడా పెద్దగా అంచనాలు లేని సంక్రాంతికి వస్తున్నాం సూపర్ డూపర్ హిట్ అయింది. సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ అనిపించింది. ఇక సంక్రాంతికి ముందు ఎప్పుడూ బాక్సాఫీస్ డల్ గా ఉంటుంది. ఈ జనవరిలో కూడా అదే పరిస్థితి. డ్రీమ్ క్యాచర్, చేతిలో చెయ్యేసి చెప్పు బావ లాంటి ఐదు సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలను ఎవరూ పట్టించుకోలేదు.
500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ అన్ని ప్రాంతాల్లో డిజాస్టర్ అయింది. నిర్మాత దిల్ రాజును కోలుకోలేని దెబ్బ కొట్టింది. రాంచరణ్ కు ఆర్.ఆర్.ఆర్ సినిమాతో వచ్చిన క్రేజీ ఇది కొనసాగించలేదు. ఈ సినిమా భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమా వచ్చిన రెండు రోజులకు బాలయ్య డాకు మహారాజ్ సినిమా వచ్చింది. వరుసగా సక్సెస్ లు ఇస్తున్న బాలయ్య ఆల్రెడీ హిట్ కొట్టిన దర్శకుడు బాబి .. సితార లాంటి పెద్ద బ్యానర్ అంతా కలిసి ఈ సినిమా ఇచ్చాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటి స్వల్ప లాభాలు సాధించింది. ఇక సంక్రాంతి వరకు చివరగా వచ్చిన సినిమా సంక్రాంతి వస్తున్నాం గత యేడాది హనుమాన్ ఎలా అయితే 300 కోట్లు కొల్లగొట్టిందో సంక్రాంతి వస్తున్నాం కూడా ఒక తెలుగు రీజనల్ సినిమాగా తెరకెక్కి 300 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. అటు ఓవర్సీస్ లో మూడు మిలియన్ డాలర్ల క్లబ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఆ తర్వాత వారం ఐడెంటిటీ – డియర్ కృష్ణ – హత్య లాంటి ఐదు సినిమాలు వచ్చిన ఎవరు పట్టించుకోలేదు.
టాలీవుడ్ జనవరి బాక్సాఫీస్… సేమ్ సీన్.. సేమ్ సెంటిమెంట్ రిలీజ్..!
