మూవీ: శబ్దం
విడుదల తేది: 28-2-2025
నటీనటులు: ఆది పినిశెట్టి, లక్ష్మీ మీనన్, సిమ్రాన్, లైలా, రెడిన్ కింగ్‌స్లే, రాజీవ్ మీనన్ తదితరులు.
సాంకేతిక నిపుణులు:
కెమెరా: అరుణ్ బి
సంగీతం: తమన్
ఎడిటింగ్: వీజే సబు జోసెఫ్
నిర్మాతలు: శివ, భానుప్రియ శివ
దర్శకత్వం: అరివళగన్
గతంలో 2011లో తెలుగులో వచ్చిన వైశాలి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని వారికి కొత్త ఫీలింగ్ ఇచ్చింది .. ఇక సినిమా దర్శకుడు హీరో మ్యూజిక్ డైరెక్టర్ కలిసి మళ్లి 15 సంవత్సరాల తర్వాత శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు .. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా గతంలో వచ్చిన వైశాలి ఇలా మెప్పించిందా లేదా అనేది ఈ సినిమా రివ్యూ లో ఇక్కడ చూద్దాం.
కథ :
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే .. ఒక ఓల్డ్ కాలేజీలో రెండు హత్యలు జరుగుతాయి .. ఇక ఆ హత్యలు వెనక ఎవరున్నారు ? ఎందుకోసం ఆ మర్డర్స్ చేయాల్సి వచ్చిందని విషయాలను తెలుసుకోవడానికి హీరో ఆది పినిశెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు .. అయితే ఈ ప్రాసెస్లో ఆయనకు ఎదురైన సంఘటనలు ఏంటి ? తనను చంపాలి అనుకున్న వారు ఎవరు .. తనకు ఉన్న లింక్ ఏంటి అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా ధియేటర్లో చూడాల్సిందే.
విశ్లేషణ :
ప్రజెంట్ హారర్ సినిమాలో చేయటం అనేది కూడా ఒక ఛాలెంజ్ .. ఎందుకంటే హారర్ సినిమాలు ఎప్పుడు ఒకే రీతిలో ఉంటాయని ప్రేక్షకులు ఫిక్స్ అయి ఉంటారు .. ఒక ఇంట్లో లేక ఒక బంగ్లాలో ఒక దెయ్యం ఉంటుంది .. మొదటి భాగం అంతా అది భయపడుతుంది .. ఇంటర్వెల్ కి ఆ దయ్యనికి ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు ఒక ట్విస్ట్ ఇస్తారు .. ఇక సెకండాఫ్లో ట్వీస్ట్ వెనక ఉన్న కథని రివిల్ చేసి క్లైమాక్స్లో దాన్ని మంచి దెయ్యంగా చూపించి సినిమాని ముగిస్తారు అని నమ్మే ఆడియన్స్ ఎక్కువ .. ఇక మరి అలాంటి వాళ్లని థియేటర్ వరకు రప్పించడానికి ఎంతో పగడ్బందీగా కథ స్క్రీన్ ప్లే తయారు చేసుకోవాలి .. ఇక నిజానికి శబ్దం కూడా అదే కోవలో తీసిన సినిమానే .. కాకపోతే శబ్దం తొలి భాగం కొంచెం కొత్త స్క్రీన్ ప్లే తో నడుస్తున్న ఫీలింగ్ కలుగుతుంది .. ఇక ఇంటర్వెల్ వరకు దర్శకుడు ప్రేక్షకులను భయపెట్టడానికి చేసిన ప్రయత్నాలు కొంత వర్కౌట్ అయ్యాయి .. అయితే సెకండాఫ్ మొదలైన కాసేపటికి మిగిలిన కథపై ఒక క్లారిటీ వచ్చేస్తుంది .. ఇక తర్వాత ఊహించిన సన్నివేశాలు తెరపైకి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది .. ఇక దాంతో హారర్ సినిమా ఫీలింగ్ పై రొటీన్ కథ అనే ఫీలింగ్ మైండ్ లో వచ్చేసింది .. 15 ఏళ్ల క్రితం వచ్చిన వైశాలి కాంబో కాబట్టి ప్రేక్షకులను కచ్చితంగా శబ్దంపై కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది .. సినిమా భయపెట్టేలా ఉంటుందని కూడా అనుకుంటారు కానీ అలాంటివి సినిమాలో లేకపోగా రోటీన్ సినిమాగా ఉంటుంది శబ్దం . ఇక ఈ సినిమా విషయంలో దర్శకుడు చేసిన వర్క్ ఎక్కువగా లేదు . మొత్తం టెక్నికల్ టీం పైనే భారం వదిలేసాడు . ఇక తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో మరోసారి పరవాలేదు అనిపించాడు .. సినిమాటోగ్రాఫర్ కూడా తన డ్యూటీ తాను బాగా ఇచ్చాడు.
పర్ఫామెన్స్:
ఇక ఈ సినిమాలో నటించిన నటీనటుల విషయానికి వస్తే .. హీరోగా ఆది పినిశెట్టి ఒక డిఫరెంట్ పాత్రలో కనిపిస్తు అంతే కాకుండా అందులో తన అద్భుతమైన నటనతో మెప్పించాడు .. ఇలాంటి క్యారెక్టర్లు చేయడం హీరోగా ఆదికి కొత్త ఏమీ కాదు .. తనదైన నటనతో ఆ పాత్రకి ఒక ఐడెంటిటీ తీసుకురావడం లో ఆది పినిశెట్టి మొదటి నుంచి సక్సెస్ సాధించారు .. ఇక సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ క్యారెక్టర్ కొంత వరకు ఇబ్బంది కలిగించింది ఆమె సినిమాలో అక్కడక్కడా తన పాత్ర పరిదిలో లిమిట్స్ ను క్రాస్ చేసి బయటకు వెళ్లినట్టుగా అనిపిస్తూ ఉంటుంది .. ఇక మిగిలిన క్యారెక్టర్ లో నటించిన వారు కూడా తమ పాత్రకు తగ్గట్టు నటించి మెప్పించారు.
ప్లస్ పాయింట్స్:
మొదటి భాగం:
ఆది పినిశెట్టి
టెక్నికల్ వాల్యూస్
మైనస్ పాయింట్స్:
లాజిక్ లేని సీన్స్
సెకండాఫ్
చివరగా: శబ్దం అంటూ వచ్చిన ఆది పినిశెట్టి ప్రేక్షకులను మెప్పించడంలో మరోసారి డీలపడ్డాడు..
రేటింగ్: 2