గత కొన్నేళ్లుగా బాలీవుడ్లో ఒక్క సరైన హిట్ కూడా లేదు. సౌత్ సినిమాల డామినేషన్ నార్త్‌లో ఎక్కువుగా కనిపిస్తోంది. ఈ టైంలో బాలీవుడ్ సినిమా రీసెంట్ గా అందించిన లేటెస్ట్ భారీ హిట్ సినిమా ఛావా. బాలీవుడ్ టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ హీరోగా.. మన కన్నడ ముద్దుగుమ్మ అయిన.. హీరోయిన్ రష్మిక మందన్నా కలయికలో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాను తెరకెక్కించారు.
ఇక ఛావా సినిమా పాన్ ఇండియా లెవల్లో ఒక్క హిందీ భాషలోనే వచ్చినా వసూళ్ల పరంగా మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మాత్రమే కాదు.. వరల్డ్ వైడ్‌గా ఛావా తొలి వారం వసూళ్ల వర్షం కురిపించేసింది. వారం రోజులకు ఛావా ఇండియా వైడ్‌గా 7 రోజులకు 225 కోట్ల నెట్ వసూళ్లు అందుకుంటే.. వరల్డ్ వైడ్‌గా రు. 310 కోట్ల గ్రాస్ వసూల్లు అందుకున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి.ఇలా మొదటి వారం సెన్షేషనల్ నెంబర్స్ నమోదు చేసిన ఛావా సినిమా దూకుడు బాక్సాఫీస్ వద్ద రెండో వారంలోనూ స్ట్రాంగ్‌గా కంటిన్యూ కానుంది. ఈ సినిమాకు ఏఆర్. రెహ్మన్ సంగీతం అందించారు. మాడాక్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.