టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా గతంలో రిలీజ్ అయిన సినిమాలు ఇప్పుడు మళ్లీ రిలీజ్ అవుతుంటే ప్రేక్షకుల్లో ఎక్కడా లేని క్యూరియాసిటీ కలుగుతోంది. ఇక గతంలో ప్లాప్ అయిన సినిమాలకు కూడా ఇప్పుడు రీ రిలీజ్ చేస్తుంటే ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. చాలా మంది తెలుగు ప్రేక్షకులు ఎంతో ఇష్టపడే సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాను ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.స్టార్ హీరోలు విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి నటించిన క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ . శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన ఈ కల్ట్ క్లాసిక్ మూవీ అప్పట్లోనే బాక్సాఫీస్ దగ్గర సెన్షేషనల్ క్రియేట్ చేసింది. ఇద్దరు స్టార్ హీరోలు చేసిన మల్టీస్టారర్ సినిమా కావడంతో ఈ సినిమాకు ట్రెమండెస్ రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమాను మార్చి 7న చాలా గ్రాండ్‌గా రీ రిలీజ్ చేస్తున్నారు.
దీంతో ఈ క్లాసిక్ మూవీని మరోసారి థియేటర్లలో చూసేందుకు తెలుగు ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో సమంత, అంజలి హీరోయిన్లుగా నటించారు. 2013 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
క్లాసిక్ బ్లాక్‌బస్టర్ ‘ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు ‘ రీ రిలీజ్ డేట్ ..!
