టాలీవుడ్ యంగ్‌టైగర్… మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ సినిమా వార్ 2. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న ఈ భారీ యాక్షన్ సినిమా బాలీవుడ్ స్పై యాక్షన్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతోంది. ఇప్పుడు ఈ సినిమాలో తారక్ కూడా కనిపించడంతో పాటు త్రిబుల్ ఆర్, దేవర సినిమాలతో తనకు వచ్చిన పాన్ ఇండియా క్రేజ్‌ను కంటిన్యూ చేసేందుకు వార్ 2 చేస్తుండడంతో అంచనాలు అయితే మామూలుగా లేవు.వార్ సినిమా మీద సౌత్ నుంచి నార్త్ వరకు కనీవినీ ఎరుగని రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో తారక్, హృతిక్ మధ్య సాలీడ్ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు పాటలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మేకర్స్ ఈ సినిమాను ఫినిషింగ్ స్టేజ్‌కు తీసుకురాగా.. ఓ సాలిడ్ డ్యాన్స్ నెంబర్ కోసం రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సాంగ్ కూడా ఎన్టీఆర్ దేవర సినిమాలోని చుట్టమల్లే సాంగ్ రేంజ్‌లో ఉంటుందట.
చుట్టమల్లే సాంగ్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ తో ఈ సాంగ్‌ను కూడా చేయనున్నారట. మరి తారక్ కూడా ఈ సినిమా కంప్లీట్ చేసి ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ మీదకు వెళ్లిపోతాడు. సో వార్ 2 సినిమాను కూడా ఎన్టీఆర్ ఓ అదిరిపోయే హై ఓల్టేజ్ డ్యాన్స్ మూమెంట్ సాంగ్‌తో ఎండ్ చేయబోతున్నాడన్నమాట.
‘ వార్ 2 ‘ ను అదిరిపోయే ఫీస్ట్‌తో క్లోజ్ చేస్తోన్న ఎన్టీఆర్ .. !
