నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “డాకు మహరాజ్” . ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్ లో మరో భారీ హిట్ సినిమాగా డాకూ మహారాజ్ నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత కూడా బాలయ్య నుంచి క్రేజీ లైనప్ ఉంది. ఈ క్రమంలోనే అఖండ 2 తర్వాత తన కంబ్యాక్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేస్తున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రం “అఖండ 2 తాండవం” . ఈ సినిమా పట్ల యూనానిమాస్ గా సాలిడ్ హైప్ అయితే ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొంది.ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలయ్య లుక్ అదిరే లెవెల్లో ఉంటుందన్న టాక్ అయితే వచ్చేసింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పై ఇపుడు మరో టాక్ వినిపిస్తుంది. దీంతో అఖండ 2 ఫస్ట్ లుక్ కి మహాశివరాత్రి కానుకగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆల్రెడీ బాలయ్యపై బోయపాటి మంచి పవర్ఫుల్ లుక్ రెడీ చేసేశారని.. ఆ లుక్‌ను మహా శివరాత్రి కానుకగా రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. బాలయ్య అఘోరా విశ్వరూపానికి కొనసాగింపుగా ఈ లుక్ ఉంటుందని అంటున్నారు.
‘ అఖండ 2 ‘ ఫస్ట్ లుక్ డేట్… బాలయ్య విశ్వరూపం ఏ స్టైల్లో అంటే..!
