రివ్యూ : మజాకా
విడుదల తేదీ : ఫిబ్రవరి 26, 2025
నటీనటులు : సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేష్, అన్షు సాగర్, మురళీ శర్మ, హైపర్ ఆది, శ్రీనివాస్ రెడ్డి
దర్శకుడు :త్రినాథరావు నక్కిన
నిర్మాత : రాజేష్ దండ, ఉమేష్ కే ఆర్ బన్సల్
సంగీతం : లియోన్ జేమ్స్
ఛాయాగ్రహణం : నిజర్ షఫీ
కూర్పు :చోటా కే ప్రసాద్
రెగ్యులర్ రొటీన్ ఫార్ములా కథలతో కమర్షియల్ విజయాలు అందుకనే దర్శకుడు త్రినాధరావు నెక్కిన .ఆయనతో రచయిత బెజవాడ ప్రసన్న కలవడంతో ఈ ధ్వయం ఇప్పటివరకు మంచి విజయాలు అందుకుంటూ వచ్చారు .. ఇక ఇప్పుడు తాజాగా వీరి కాంబినేషన్లోనే సందీప్ కిషన్ హీరోగా రాజేష్ దండ నిర్మాతగా మజాకా మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. ట్రైలర్ నుంచి రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ అనిపించుకుంది .. అలాగే ఈ మూవీ ప్రమోషన్స్ లో మేకర్స్ చేసినంత ఫన్ ఎంటర్టైన్మెంట్ ఈ మూవీలో ఉందా లేదా అనేది ఇక్కడ చూద్దాం.స్టోరీ:
వెంకటరమణ (రావు రమేష్) భార్యకు కొడుకు కృష్ణ (సందీప్ కిషన్) పుట్టగానే మరణిస్తుంది .. అప్పటినుంచి తండ్రి కొడుకులు కలిసి జీవిస్తూ ఉంటారు .. అలా వీలైనంత త్వరగా కోడికి మంచి ఫ్యామిలీ ఉన్న అమ్మాయిని పెళ్లి చేయాలని కృష్ణ కోసం పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు వెంకటరమణ .. ఇద్దరు మగవాళ్ళు ఉండే ఇంటికి అమ్మాయిని ఇవ్వమని చాలా మంది చెబుతూ ఉంటారు .. ఇక దాంతో తండ్రి మళ్లీ పెళ్లి చేసుకుంటే కొడుక్కి పెళ్లి అవుతుందని కొందరు సలహా ఇస్తారు .. అంతలోనే కొడుకు కృష్ణ ఓ కాలేజీలో హీరోయిన్ సత్య ( రీతు వర్మ) తో ప్రేమలో పడతారు .. హీరోయిన్ ప్రేమకు ఒప్పుకోదు అయినా కృష్ణ ప్రయత్నిస్తూనే ఉంటాడు .. మరోపక్క ఓ రోజు బస్టాండ్లో యశోద (అన్షు) చూసి తండ్రి వెంకటరమణ ప్రేమలో పడతాడు .. అయితే ముందు వెంకటరమణ కి నో చెప్పిన ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ కి ఓకే చెబుతుంది .. అదే సమయంలో కృష్ణ ప్రేమ కూడా సక్సెస్ అవుతుంది .. ఇలా తండ్రి కొడుకులు ఇద్దరు ఒకేసారి ఇద్దరు అమ్మాయిలను ప్రేమలో పడేస్తారు .. ఇక పెళ్లి ఓకే అంటున్న టైంలో అనుకోని ట్విస్ట్ వస్తుంది .. అయితే వీరు ప్రేమించిన అమ్మాయిలు ఇద్దరు ఓకే ఇంటివారు .. ఎవరికి వారు ఏమవుతారు .. ప్రేమ కథలు విలన్ మురళీ శర్మ ఇచ్చిన షాక్లేంటి అసలు లవ్ స్టోరీలు విజయం సాధించాయ అనేది థియేటర్లో చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే.. మూవీ మొదటి నుంచి చివర వరకు అవుట్ డౌట్ ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే కొనసాగుతూ ఉంటుంది .. వరుసగా కమర్షియల్ సినిమాలు చూస్తూ మంచి విజయాలు అందుకుంటున్న దర్శకుడు త్రినాధరావు .. ఆయన డైరెక్షన్లో సినిమా వస్తుందంటే అది కమర్షియల్ సినిమా అని మనం ముందుగానే అనుకోవచ్చు .. హాయిగా ఒక రెండు గంటలపాటు దియేటర్ల కూర్చుని నవ్వుకోవచ్చు అనే మైండ్ సెట్ లో ప్రేక్షకుడు థియేటర్కు వెళితే ప్రతి ప్రేక్షకుడికి ఈ సినిమా బాగుంటుంది..
అయితే అదే స్థాయిలో ఈ సినిమాలో కూడా నాలుగు పాటలు రెండు ఫైట్లు మూడు జోకులు అన్నట్టుగానే సినిమా వెళుతుంది .. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి బోరు కట్టకుండా సినిమాని తీసుకు వెళ్ళటంలో మరోసారి దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి .. రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ డైలాగులు కొంతవరకు సినిమాకు ప్లస్ అయ్యాయి .. అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు మలయాళం బ్రో దాడి సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నట్టుగా అనిపిస్తుంది .. అయినా కూడా వాటిని తెలుగు నేటి వేటికి తగ్గట్టుగా మార్చడంలో దర్శకుడు సక్సెస్ సాధించారు .. మొదటి భాగం అంత ఎంటర్టైన్మెంట్ గా తీసుకు వెళ్లినప్పటికీ సెకండాఫ్ వచ్చేసరికి మాత్రం ఒక ట్విస్టుతో సెకండ్ హాఫ్ని మొదలు పెడతారు. సెకండ్‌ఫ్ లో దర్శకుడు ఎత్తుకున్న పాయింట్ పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా చూపించడంలో అక్కడక్కడ ఫెయిల్యూర్ అయ్యారనే చెప్పాలి .. దాని కారణంగా సినిమాలో కొంత అసంతృప్తి అయితే అనిపిస్తుంది .. ఇది కూడా చక్కగా ఫుల్ ఫీల్ చేసినట్టయితే సినిమా కూడా మరో లెవల్లో ఉంటుంది.
నటీనటుల పర్ఫామెన్స్:
ఈ సినిమాలో నటించిన నటీనటుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే .. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా రేంజ్ లోనే ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైన్ చేయటం అనేది నిజంగా గొప్ప విషయమే .. నటన పరంగా సందీప్ కిషన్ కూడా తనదైన రీతిలో ఆకట్టుకున్నాడు .. ఈ కథను ఎంత బలంగా నమ్మాడో అతని కాన్ఫిడెన్స్ చూస్తే అర్థమవుతుంది .. రావు రమేష్ ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నమైన క్యారెక్టర్ .. ఆయనకు పాటలున్నాయి డాన్సులు కూడా చేశాడు .. అవసరమైన చోట ఎమోషన్ కూడా పండించాడు .. అన్షు కూడా బాగా నటించింది .. అమె పాత్ర సినిమాలో సర్ప్రైజ్ .. హీరోయిన్ రీతు వర్మ ఎప్పట్లాగానే ఓకే అనిపించింది .. డాన్సులు విషయంలో బాగా ఇబ్బంది పెడుతున్నట్టు అర్థమవుతుంది .. అలాగే సినిమాలో కనిపించని సైకోగా మురళి శర్మ పాత్ర ఆకట్టుకుంటుంది .. అతను కూడా బాగా ఎంటర్టైన్మెంట్ చేశాడు .. ఇక రఘుబాబు , ఆది , శ్రీనివాసరెడ్డి వంటి వారు పెట్లగానే తమ పాత్రలో మెప్పించారు.టెక్నికల్:
ఇక సినిమాలోని టెక్నికల్ విషయానికి వస్తే మ్యూజిక్ అంత పెద్దగా మెప్పించలేక పోయినప్పటికీ .. సినిమాలో వచ్చి ఒక ఫోక్ సాంగ్ మాత్రం ప్రేక్షకులను బాగా అలరించిందని చెప్పాలి .. అలాగే ఈ సినిమాలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అక్కడక్కడ కొంతవరకు ఓకే అనిపించినప్పటికీ మొత్తంగా మ్యూజిక్ విషయంలో మాత్రం సినిమా చాలావరకు డల్ అయింది . అలాగే ఎమోషనల్ సీన్స్లో కొంతవరకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపించింది .. సినిమా విజువల్స్ విషయానికొస్తే ఈ సినిమాల్లో కొన్ని షాట్స్ మాత్రం విజువల్స్ చాలా గొప్పగా అనిపించాయి .. ముఖ్యంగా ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫైట్ సీన్స్ లో విజువల్స్ చాలా బాగున్నాయి .. అలాగే సినిమాలో ఫైట్స్ కూడా హైలెట్ అయ్యో విధంగా వచ్చాయి .. ఎడిటింగ్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది .. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎంతో రిచ్‌గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
డైరెక్షన్
మొదటి భాగం
ఫ్లోక్ సాంగ్
మైనస్ పాయింట్స్:
రొటీన్ స్టోరీ
సెకండ్ ఆఫ్
ఫైనల్ పాయింట్: లాజిక్స్ లేకుండా సినిమా చూస్తూ ప్రేక్షకులకు మంచి మజా ఇస్తుంది..
రేటింగ్: 2.75