మెగా ఫ్యామిలీలో ప్రస్తుతం టాలీవుడ్ లో ఏకంగా 11 మంది హీరోలు ఉన్నారు. మెగా ఫ్యామిలీ వారసులతో పాటు అటు అల్లూ ఫ్యామిలీ నుంచి వారసులతో పాటు మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా హీరో అయిపోయారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదల కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె కూడా హీరోయిన్‌గా కొన్ని సినిమాలలో నటించారు. గత రెండేళ్లలో మెగా ఫ్యామిలీ హీరోలు నటించిన సినిమాలు టాలీవుడ్ లో సగటున నెలకి ఒకటి చెప్పును రిలీజ్ అవుతూ వచ్చాయి. మెగా ఫ్యామిలీకి బలమైన పిల్లర్ మెగాస్టార్ చిరంజీవి. ఆయన వారసుడుగా సినిమాల్లోకి వచ్చి టాలీవుడ్ లోనే తిరిగి లేని క్రేజీ హీరోలలో ఒకరిగా దూసుకుపోతున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ గా ఉన్న రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ఆస్కార్ అవార్డు రావడంతో రామ్ చరణ్ బాధ్యత మరింత పెరిగింది. తాజాగా రాంచరణ్ .. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్ సినిమాతో ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కేంద్రం రాజమహేంద్రవరంలో చాలా వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ కు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి .. అటు రాంచరణ్ బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా వచ్చారు.
ఈ క్రమంలోని రామ్ చరణ్ డెడికేషన్ తో పాటు సినిమాల కోసం ఎలా కష్టపడతాడో చెప్పి ప్రశంషల వర్షం కురిపించారు. అలాగే రామ్ చరణ్ పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ పంచుకున్నారు. రాంచరణ్ కు ఆ పేరు తమ తండ్రిగారు ఆయన వెంకట్రావు గారు పెట్టారని .. తమ ఇంటి దైవం హనుమంతుని పేరు వచ్చేలా రామ్ చరణ్ పేరు పెట్టారని చెప్పారు. రాముడి చరణాల దగ్గర ఉండేవాడు హనుమంతుడు అలా పేరు కలిసేలా రామ్ చరణ్ పేరు పెట్టినట్టు పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు.