Moviesమెగా ఫ్యామిలీకి ఇష్ట‌మైన టాలీవుడ్ హీరో తెలుసా.. మెగా హీరోలు కానే...

మెగా ఫ్యామిలీకి ఇష్ట‌మైన టాలీవుడ్ హీరో తెలుసా.. మెగా హీరోలు కానే కాదు…!

మెగా ఫ్యామిలీలో ఇప్పటి కే పదిమందికి పైగా హీరోలు వచ్చేసారు టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ హీరోలను క్రికెట్టీం తో పోలుస్తున్నారు. మెగా ఫ్యామిలీ హీరోలు .. అటు అల్లు అరవింద్ ఇద్దరు వారసులతో పాటు మెగా ఫ్యామిలీ అల్లుళ్ళు .. చివరకు నాగబాబు కుమార్తె నిహారిక వీళ్ళందరూ కలుపుకుంటే మెగా ఫ్యామిలీ నుంచి ఏకంగా 12 నుంచి 13 మంది నటీనటులు ఇండస్ట్రీలో ఉన్నారు. అలాగే నాగబాబు కూడా మెగా ఫ్యామిలీ టీమ్ లోనే ఉంటారు.

Mega Family celebrates Sankranti traditionally - Telugu News -  IndiaGlitz.com

మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి … పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ … గ్లోబ‌ల్ స్టార్ రామ్ చరణ్ – వరుణ్ తేజ్ – సాయి ధరంతేజ్ – పంజా వైష్ణవ తేజ్ అలాగే అల్లు ఫ్యామిలీ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – అల్లు శిరీష్ లాంటి ఎంతమంది హీరోలు ఉన్నా కూడా మెగా ఫ్యామిలీలో ఆడవాళ్లకు మరో హీరో సినిమాలు అంటే చాలా ఇష్టం అట. మెగా ఫ్యామిలీలో మహిళలకు ఇష్టమైన ఆ హీరో మెగా ఫ్యామిలీ హీరో కాకపోవటం మరో విశేషం. ఈ విషయాన్ని గేమ్‌ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు. మెగా ఫ్యామిలీలో మహిళలు సైతం ఇష్టపడి మరి సినిమాలు చూసే ఆ టాలీవుడ్ హీరో ఎవరో ? కాదు. నేచురల్ స్టార్ నాని.

Who is Nani's favourite hero?

నాని గారి సినిమాలు చాలా బాగుంటాయి … మా కుటుంబంలో వాళ్లకు … మా అక్కలకు నాని గారు నటించిన సినిమాలు అంటే చాలా ఇష్టం. వాళ్లు నాని గారి సినిమాలు క్రమం తప్పకుండా చూస్తారు … మాకు మరే హీరో మీద ఈర్ష – అసూయ ద్వేషాలు లాంటివి ఉండవు అని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇక రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన గేమ్ ఛేంజ‌ర్ సినిమా ఈ నెల 10 న వ‌ర‌ల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news